రజనీ, కమల్ శాకాహారులే

సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ఇప్పుడు పూర్తి శాకాహారులుగా మారిపోయారు.

కారణాలు చూద్దాం

నాన్ వెజ్ అంటే విపరీతమైన ఇష్టం ఉండే రజనీకాంత్ రెండేళ్ళ క్రితం ఆరోగ్యం బాగులేక సింగపూర్ వెళ్లి అత్యవసర చికిత్స చేసుకున్నప్పటి నుంచి శాకాహారిగా మారిపోయారు.

లోక నాయకుడు కమల్ హాసన్ ఆహార అలవాట్లలోను మార్పులు చోటు చేసుకున్నాయి. పచ్చి కాయగూరలనే ఎక్కవుగా తింటున్న కమల్ ఈ పద్ధతి బాగానే ఉందంటున్నారు. అలాగే ఆయన కుమార్తె శృతి హాసన్ కు కూడా ఆ విషయం చెప్పడంతో ఆమె కూడా ఇప్పుడు నాన్ వెజ్ కి దణ్ణం పెట్టి శాకాహారిగా మారిపోయారు.

హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంతో ఇష్టమున్న అనుష్కా రుద్రమదేవిగా నటించడం మొదలు పెట్టినప్పటి నుంచి నాన్ వెజ్ మానేశారు.

నయనతార వారంలో ఒక్క రోజు మాత్రమే నాన్ వెజ్ తింటున్నారు. మిగిలిన రోజులు శాకాహారంలో పౌష్టిక ఆహారాన్నే తీసుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.