రజనీ స్టైల్ పై షారూఖ్ ఖాన్ ...

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ జగమెరిగిన స్టార్ అయితేనేం ఆయన ఎంతగానో అభిమానించే నటుడు ఎవరో తెలుసా?
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే షారూఖ్ ఖాన్ కు అమిత ఇష్టం.
రజనీపై ఉన్న అభిమానాన్ని ఆయన ఇటీవల రజనీకాంత్ నటించిన కొచ్చడయాన్ చిత్రంలోని పాటల వేడుక కార్యక్రమంలో అందరి సమక్షంలో చెప్పుకొచ్చారు.
చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించిన షారూఖ్ రజనీకి సలాం చేసి లుంగీ  డాన్సు చేస్తే ప్రేక్షకులు ఆయనేదో ఆకట్టుకునేందుకు అలా చేసాడని అనుకున్నారు.
కానీ షారూఖ్ రజనీపై తనకున్న అభిమానాన్ని ఆ విధంగా వ్యక్తం చేశారన్నది అతి కొద్ది మందికే తెలుసు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” నేను సినిమాలోకి అడుగు పెట్టే ముందు రజనీ సినిమా షూటింగులు చాలానే చూసాను. షూటింగ్ వేళ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు రజనీ మాత్రం ఒక మూలగా కూర్చుని సిగరెట్టుని గాలిలోకి విసిరి నోటితో పట్టుకోవడానికి అదే పనిగా ప్రాక్టీస్ చేసేవారు. అహర్నిశలూ శ్రమించ బట్టే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు” అని షారూఖ్ ఖాన్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.