రవితేజ పవర్

హీరో రవితేజ బలుపు తర్వాత నటిస్తున్న చిత్రమే పవర్. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంతో సాగుతోంది.

చాలా రోజుల తర్వాత అన్ని విధాలుగా ఒక మంచి స్క్రిప్ట్ కుదిరినట్టు కథానాయకుడు రవితేజ చెప్పారు. ఇది తన సిని కెరీర్ లో ఓ మంచి  చిత్రమవుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేసారు.

రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తెలుగులో నేరుగా నిర్మిస్తున్న తొలి చిత్రమిది.

విక్రమార్కుడు చిత్రం స్థాయి పాత్రను రవి తేజ ఇందులో పోషించారు. సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్, రవితేజ కాంబినేషన్ లో ఈ చిత్రం సంగీత పరం గానూ, పాటల పరంగానూ మంచి హిట్టు కొడుతుందన్నది దర్శకుడు బాబీ అలియాస్ కె ఎస్ రవీంద్ర ధీమా వ్యక్తం చేసారు.

ఈ చిత్రంతోనే రవీంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

పరుచూరి వెంకటేశ్వర రావు, పోసాని కృష్ణ మురళి, జోగీ బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి కోన వెంకట్ మాటలు రాసారు.

Send a Comment

Your email address will not be published.