రాజకీయాలు సంబంధం లేనివి

నటుడు నందమూరి కళ్యాన్ రామ్ తనకు రాజకీయాలు ఏ మాత్రం సంబంధం లేనివని స్పష్టం చేసారు.

సినీ పరిశ్రమలో ఇప్పదికే పదేళ్ళు పూర్తి చేసుకున్న కళ్యాన్ రామ్ నటించి విడుదల అయిన పటాస్ చిత్రం అనుకోని విధంగా విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉన్నారు. తనకు తెలిసింది నటన అని, అంతే తప్ప సినిమా ఆడిందా  లేక ఫ్లాప్ అయ్యిందా అనేది ప్రధానం కాదని, తెలిసిన నటనలో ప్రతిభ కనిపించడానికి అహర్నిశలూ కృషి చేస్తానని ఆయన అన్నారు.

అయినా సక్సెస్ అనే మాట వినడం అనేది ఎప్పుడూ బాగానే ఉంటుందని, పైగా చాలా కాలం తర్వాత తన చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉందని కళ్యాన్ రామ్ చెప్పారు.

ఇప్పుడు దక్కిన విజయంతో తాను మున్ముందు నటించబోయే చిత్రాలలో మరెంతో కష్టపడి అంకితభావంతో పని చేయవలసి ఉందని ఆయన అన్నారు. గత పదేళ్ళ కెరీర్ లో తాను కొన్ని తప్పులు చెయ్యకపోలేదని, అయితే చేసిన తప్పుల నుంచి తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అని చెప్పారు. ప్రేక్షకులు స్వాగాతిస్తారనే నమ్మకంతో తాను సొంతంగా కొన్ని సినిమాలు చేసి దెబ్బతిన్నానని, దానితో తన పంధా మార్చుకున్నాను అని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు పటాస్ విద్జయం సాధించడం బాగుందని అన్నారు. దర్శకుడు అనిల్ తనకు కథ చెప్పినప్పుడే ఈ పటాస్ సినిమా విజయం ఖాయమని అనుకున్నాను అని అన్నారు.

తన కెరీర్ లో తమ కుటుంబ సభ్యుల  ప్రోత్సాహం చాలానే ఉందని, తాను ఎన్నో కస్టాలు పడ్డానని, అయినప్పటికీ తమ కుటుంబం యావత్తు తన వెంటే ఉండి ఎంతగానో సహకరించారని, వారు తన మీద పెట్టుకున్న నమ్మకం వృధా కాలేదని కళ్యాన్ రామ్ చెప్పారు.

తన ప్రొడక్షన్ హౌస్ ని విస్తరించి ఇతర నటులతోనూ సినిమాలు నిర్మించాలని ఉందని అంటూ తాను నిర్మిస్తున్న కిక్ – 2 సినిమాను ప్రస్తావించారు.  సినిమాలే తనకు బ్రెడ్డు, వెన్న అని, ఈ రంగం తనకు తెలిసిన రంగం అని, దీనిని విస్తరించాలని ఉందని ఆయన చెప్పారు.

 

Send a Comment

Your email address will not be published.