రాజకీయ ప్రవేశం

Vani Vishvanathఅలనాటి నటి వాణీవిశ్వనాథ్ రాజకీయరంగప్రవేశం చేసింది. ఇటీవల ఆమె తిరుమల తిరుపతి వెళ్ళివచ్చిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించింది. తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్టు కూడా వెల్లడించింది.

జయ జానకి నాయక చిత్ర షూటింగ్ సమయంలో ఓరోజు ఆమె తన మేనజర్ తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవాలనుందని తెలిపింది. దాంతో ఆ క్షణంలోనే వాణీ విశ్వనాథ్ రాజకీయాలలో చేరాలనుకున్న ఆసక్తి బహిర్గతమైంది. తెలుగుదేశం పార్టీ తనకే పని చెప్పినా తాను వందశాతం అంకితభావంతో ఆ కార్యం చేస్తానని, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఆమె చెప్పింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్న రోజా గురించి మాట్లాడుతూ తనకు ఆమెతో వ్యక్తిగతంగా ఎలాటి కోపాలూ తాపాలూ విద్వేషాలూ లేవని వాణీ విశ్వనాథ్ చెప్పింది.

రోజా మంచి నటి అని, ఒకవేళ తాను గానీ ఆమెపై పోటీ చేసే పరిస్థితి వస్తే అది వ్యక్తిగతం కాదని, అదంతా పార్టీల మధ్య వైరమే తప్ప రోజాతో కాదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నగరి (చిత్తూరు జిల్లా) గేట్ వే అని, కనుక అక్కడి నుంచి తన రాజకీయ కార్యకలాపాలు ప్రారంభిస్తానని, అలాగని తాను నగరికే పరిమితం కాదని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమేనని ఆమె అన్నాది.

ప్రస్తుతం నగరి నియోజక వర్గానికి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇలా ఉండగా వాణీవిశ్వనాథ్ తండ్రి జ్యోతిష్కుడు. ఆమె రాజకీయ కెరీర్ గురించి ఆయన ఆమె చిన్నప్పుడే ఊహించి లెక్కలు కట్టి చెప్పారట.

Send a Comment

Your email address will not be published.