రాజకీయ వైరాగ్యం

ప్రసిద్ధ చలన చిత్ర నటి శారద రాజకీయ సన్యాసం చేశారు. “రాజకీయాలంటే అసహ్యం వేస్తోంది” అని ఆమె కనిపించిన వారందరితోనూ అంటున్నారు. సినిమాలలో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన శారదకు రాజకీయాలు మాత్రం వంటబట్టినట్టు కనిపించడం లేదు. ఆమె గతంలో 17 నెలల పాటు లోక్ సభ కాంగ్రెస్  సభ్యురాలిగా ఉన్నారు. ఈసారి ఆమె నెల్లూరు  జిల్లా వేంకటగిరి నుంచి పోటీ చేయాలనుకున్నారు కానీ ఆ ప్రయత్నంలో సఫలం కాలేకపోయారు. సినీ రంగంలో మకుటం లేని మహారాణిగా వెలిగి అనేక పురస్కారాలు చేజిక్కించుకున్న శారదకు రాష్ట్ర రాజకీయాలు వంటబట్ట లేదు.

“అసలు ఈ రాజకీయాలేమిటో, వీటిని రాజకీయాలని ఎందుకంటున్నారో అర్థం కావడం లేదు. వీటితో సర్దుకు పోవడం నావల్ల కాదు” అని ఇటీవల తన మకాంను హైదరాబాద్ నుంచి చెన్నై మార్చేసిన శారద చెప్పారు. రాజకీయాలంటే ఏమిటో తెలుసుకోకుండా ఈ రంగంలో ప్రవేశించి శారద పెద్ద తప్పే చేసినట్టు కనిపిస్తోంది.

Send a Comment

Your email address will not be published.