రాజమౌళి తండ్రి ఇచ్చిన కథ

ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి, రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ తాను రాసిన ఒక కథను బాలీవుడ్ నటుడు, దర్శకుడు జాన్ అబ్రహాంకు ఇచ్చారు. విజయేంద్ర ప్రసాద్ కలం   నుంచి జాలువారిన సమరసింహారెడ్డి కథకు సంబంధించిన హక్కులను జాన్ అబ్రహాం అంతకుముందే కొనుగోలు చేసి దాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విజయేంద్ర ప్రసాద్ ఆ వార్తకు  స్పందించి అది సమరసింహా రెడ్డి కథ కాదని, తాను మరో కథ రాసి జాన్ అబ్రహాం కు ఇచ్చానని అన్నారు.

విజయేంద్ర ప్రసాద్ మగధీర, యమదొంగ, విక్రమార్కుడు, చత్రపతి వంటి విజయవంతమైన చిత్రాలకు కథలు రాసారన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇలా ఉండగా, జాన్ అబ్రహాం విజయేంద్ర ప్రసాద్ ను కలిసి హిందీలో ఓ మంచి చిత్రం తీయడానికి ఓ కథ కోరడంతో సరేనని ప్రసాద్ తాజాగా ఓ కొత్త కథ రాసి ఇచ్చారన్నది తాజా వార్త.

తాను కథ ఇవ్వడమైతే ఇచ్చానని, జాన్ తీయబోయే సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు వంటి వివరాలు తనకు తెలియదని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

ఒకవేళ జాన్ అబ్రహాం నిజంగానే సినిమా తీస్తే విజయేంద్ర ప్రసాద్ రాసిన ఓ కథ హిందీలో నేరుగా తెరకెక్కబోవడం ఇదే మొదటిసారి అవుతుంది.

గతంలో విజయేంద్ర ప్రసాద్ కథ ఆధారంగా తీసిన విక్రమార్కుడు చిత్రాన్ని పలు భాషలలో రీమేక్ చేసారు.

Send a Comment

Your email address will not be published.