రాజశేఖర్ రెండో ఇన్నింగ్స్

రాజశేఖర్ రెండో ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు. హీరోగా కాకుండా విలన్ గా వెండితెరపై కనిపించబోతున్నారు.

శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించబోయే చిత్రంలో రాజశేఖర్ విలన్ పాత్ర పోషించడానికి ఒప్పుకున్నారు.

ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న ఆక్సిజన్ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం మొదలవుతుంది.

ఇప్పటికే దర్శకుడు శ్రీవాస్ కథను గోపీచంద్ కి చెప్పగా అది ఆయనకు బాగా నచ్చింది. ఈ కథలో విలన్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, చాలా పవర్ ఫుల్ పాత్ర అని దర్శకుడు చెప్పారు. ఈ విలన్ పాత్రకైతే రాజశేఖర్ అన్ని విధాలా సరిపోతారని భావించి ఆయనను సంప్రదించగా అందుకు రాజశేఖర్ సమ్మతించారని అభిజ్ఞ వర్గాల భోగట్టా.

ఈ చిత్రం కార్యరూపం దాల్చితే శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో ఓ చిత్రం రావడం ఇది మూడవది అవుతుంది. అంతకుముందు వీరి కాంబినేషన్ లో శౌర్యం, లౌక్యం చిత్రాలు వచ్చాయి. రెండూ విజయవంతమైన చిత్రాలే.

ఇలా వుండగా రాజశేఖర్ చివరగా కనిపించిన చిత్రం గడ్డం గ్యాంగ్. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడిన సంగతి తెలిసిందే.

Send a Comment

Your email address will not be published.