రాజా రాణీ

“దర్శకుడు అట్లీ చెప్పిన కథ బాగా నచ్చింది. ప్రేమ విఫలమైనా జీవితం ఫెయిల్ కాదు అనే పాయింట్ బాగా నచ్చడంతో రాజా రాణీ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాను”” అని ఆ చిత్ర కథానాయకుడు ఆర్య తెలిపారు. ప్రస్తుతం అభిమానుల ముందు ఉన్న రాజా రాణీ చిత్రం కథాంశం మెరుగ్గానే ఉందన్నది ప్రేక్షకుల మాట.  గత ఏడాది ఈ చిత్రం తమిళంలో అదే పేరు మీద విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందు కూడా అదే పేరుతో వచ్చింది. ఆర్యతోపాటు నయనతార, జై, నస్రియా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
హీరో ఆర్య మాట్లాడుతూ చాలెంజింగ్ చిత్రాలంటే తనకు ఎంతో ఇస్తామని చెప్పారు. ఇందులో తనది రొమాంటిక్ కామెడీ పాత్ర అని తెలిపారు. తెలుగులోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్తూ పూర్వం వరుడు అనే చిత్రంలో నెగటివ్ పాత్ర పోషించానని, అటువంటి పాత్రలోనూ తాను నటించడానికి సిద్ధమని అన్నారు. తనకొచ్చే అవకాశాలను వదులుకోకుండా మంచి కథ ఉన్న చిత్రాలు నటించడానికి తాను ఎప్పుడూ వెనకడుగు వెయ్యనని ఆర్య చెప్పారు.

Send a Comment

Your email address will not be published.