రామయ్య వచ్చేసాడు

దసరాకి రామయ్య వస్తాడా …? రాడా …? అనే అభిమానుల అనుమానాల్ని తొలగిస్తూ శుక్రవారం ఉదయమే రామయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిమానుల భారీ అంచనాలతో ప్రేక్షకుల మధ్యకి వచ్చిన రామయ్య వారి అంచనాల్ని అందుకొని విజయం సాధించాడో, లేదో తెలుసుకుందామా :

రవితేజాకి ఓ మిరపకాయ్, గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్ కి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు హారీష్ శంకర్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్ టిఆర్ కలిసి తొలిసారిగా రామయ్యా .. వస్తావయ్యా కు కలిసి పని చేశారు. సీతమ్మ వాకిట్లో వంటి మంచి హిట్ తర్వాత దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం. మరి వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా సక్సెస్ అవునో, కాదో చూద్దాం.

జూనియర్ ఎన్ టి ఆర్, సమంత, ప్రత్యేక పాత్రలో శృతిహాసన్ నటించిన రామయ్యా వస్తావయ్యా లో సీతారామయ్య గారి మనవరాలు సినిమా లో అక్కినేని పక్కన నటించిన రోహిణి హటగిని, ముకేష్ రుషి, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
సినిమా కధ లోనికి వెళ్తే, హైదరాబాద్ లోని ఒక కాలేజీ లో నందు ( జూనియర్ ఎన్ టి ఆర్ ) చదువుతుంటాడు. అక్కడే చదివే అందమైన అమ్మాయి అక్షర (సమంత)ని చూసిన క్షణం లోనే ప్రేమ లో పడుతాడు. ఆమె ప్రేమ కోసం వెంప ర్లాడు తూ, చిలిపి చేష్టలు అల్లరి పనుల తో అక్షరని తన ప్రేమ లో పడేస్తాడు. అక్షర వాళ్ళ నాన్న మినిస్టర్. ఆమె కి బామ్మ తో పాటు అక్క కూడా ఉంది. అక్క పెళ్లి కోసం ఊరికి వెళుతున్న అక్షర కుటుంబం తో కలిసి నందు కూడా వెళతాడు. అక్షర ప్రేమ కోసమే నందు ఆమె చుట్టూ తిరిగాడా? అక్షర అక్క ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది అని తెలుసు కోవాలంటే రామయ్యని వెళ్లి చూడాల్సిందే. ఈ సినిమా లో జూనియర్ మునుపెన్నడూ లేనంత యంగ్ గా కనిపించాడు. సమంత , శృతి హాసన్ లు తమ గ్లామర్ తో మెరిసి పోయారు. హీరోయిన్ బామ్మగా రోహిణి ప్రేక్షకుల పెదాల పై నవ్వులు పూయించారు. రావు రమేష్, కోట, తనికెళ్ళ భరణిలు సినిమాకి కావసినంత ఎంటర్ టైన్ మెంట్ పంచారు. ముఖ్యం గా కాలేజీ బాయ్ గా జూనియర్ చేసిన అల్లరి నటన తో పాటు అతని అందం ఈ సినిమా కి ప్లస్ పాయింట్ అయింది. తమన్ సంగీతం అందివ్వగా, చాయాగ్రాహకులుగా చోటా కె నాయుడు పని చేశారు.

Send a Comment

Your email address will not be published.