రామ్ చరణ్ తో శ్రీను వైట్ల

వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా రామ్ చరణ్ తో ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారు. యూనివర్సల్ మీడియా పతాకంపై నాయక్ చిత్రాన్ని నిర్మించిన డీ వీ వీ దానయ్య ఈ చిత్రాన్ని తీయబోతున్నారు. చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తొలి సారిగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే కథ తయారైంది. ఈ చిత్రం షూటింగు వచ్చే ఆగస్ట్ నెలలో ప్రారంభమవుతుందని అంచనా. భారీ వ్యయంతో నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన మరి కొన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత దానయ్య చెప్పారు. చరణ్ ప్రస్తుతం కృష్ణ వంశి దర్శకత్వంలో రూపొందుతున్న గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా?

Send a Comment

Your email address will not be published.