రామ్ లీల..రామ్ లీలే..

రామదూత క్రియేషన్స్ శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో సమర్పించిన చిత్రమే రామ్ లీల. చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్. సంగీతం స్వరపరచినది చిన్నా. హిందీలో  సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

నందిత, అభిజిత్, అక్ష, సప్తగిరి, అలీ తదితరులతో కలిసి నటించిన హవీష్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందున్నాడు.

మలేషియాలో ఆరంభమైన ఈ చిత్ర కథ అనంతరం అక్కడి నుంచి అమెరికా, అటు తర్వాత భారత దేశం ఇలా సాగుతుంది. భూమి గుండ్రం గా ఉంది అన్నట్టుగా చివరికి  ఎక్కడైతే ఆరంభమైంది అక్కడికే అంటే మలేషియాకు చేరుకున్న ఈ చిత్ర కథ హాయిగా హ్యాపీగా  ముగుస్తుంది.

కృష్ణ పాత్రలో నటించిన  అభిజిత్   సస్య పాత్రలో నటించిన నందితను ప్రేమిస్తాడు.  అలాగే ఆమె కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటాడు. వివాహానంతరం అభిజిత్ భార్య కోసం ఉద్యోగాన్ని మార్చుకుంటాడు.  తీరా అక్కడికి వెళ్లినతర్వాత ఆమె తాను ఇష్టపడ్డ యువకుడితో వెళ్ళిపోతున్నాను కనుక తన ఆచూకీ కోసం ఎక్కడా వెతక వద్దని ఒక ఉత్తరం రాస్తుంది.

ఇంతలో అభిజిత్ ఒక్కడుగా ఓ పర్యటనకు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలోనే అతనికి హీరో హవీష్ తారసపడతాడు.  ఈ పరిచయ క్రమంలో అభిజిత్ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు సంభవిస్తాయి.

అయితే ఆ మార్పులు, హీరో ఎందుకు అభిజిత్ కు దగ్గరవుతాడు? కథానాయిక ఏమైంది? వంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి రామ్ లీల చూడాలి.

అభిజిత్ నటన  కానీ హవీష్ నటన కానీ చెప్పుకోదగ్గ రీతిలో లేదు. ఈ చిత్రంలో హాస్యం కూడా అంత బాగా పండలేదు. కథానాయిక పాత్ర కూడా గుర్తుంచుకునేలా అనిపించదు.

36 రోజుల్లో సినిమాని పూర్తి చేసుకున్నాం అని చెప్పుకోవడం తప్పించి ఈ చిత్రం గొప్పగా లేదు. కథలో కొత్తదనం లేదు. పాటల విషయంలో సన్నివేశాలు పరవాలేదు. బ్యాక్ గ్రౌండ్ సంగీత బాగు లేదు.

Send a Comment

Your email address will not be published.