"రుద్రమదేవి" ముహూర్తం ఖరారు

భారీ బడ్జెట్ తో నిర్మించిన రుద్రమదేవి చిత్రాన్ని వచ్చే డిసెంబరులో విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేసారు. ప్రస్తుతం రుద్రమ దేవి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నట్టు దర్శకుడు గుణశేఖర్ చెప్పారు.

అనుష్క ప్రధాన పాత్రలో కనిపిస్తున్న రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించారు. రానా, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరీన్ తదితరులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

“రుద్రమదేవి” ఓ చారిత్రాత్మక కథాచిత్రం.

ఈ చిత్రానికి సంబంధించి చారిత్రక పరిశోధన, కథా రూపకల్పన 2002 లో ప్రారంభమైంది. కానీ 2012 లో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. మరో ఏడాదికి అంటే 2013 లో వరంగల్ లోని వేయి స్తంభాల గుడిలో చిత్రీకరణ చేపట్టి ఈ ఏడాది సెప్టెంబర్ లో హైదరాబాదు శివారు ప్రాంతమైన గోపన్నపల్లిలో ఏడు కోటగోడల సెట్లో షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు దర్శకులు గుణశేఖర్ చెప్పారు.

హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో స్టీరియోఫోనిక్ త్రీడీ ఫార్మేట్ లో రూపొందిన ఈ తొలి భారతీయ సినిమాగా రుద్రమదేవి రికార్డు సాధిస్తుందని గుణశేఖర్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఓ మహాయజ్ఞంలాగా ఈ సినిమా షూటింగ్ సాగినట్టు చెప్పిన గుణశేఖర్ వచ్చే డిసెంబరులో ఈ సినిమాను విడుదల చేస్తామన్నారు.

ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తోట తరణి ” కళ” ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

Send a Comment

Your email address will not be published.