రెండింటిలోనూ వర్క్ చేస్తాను

తెలుగు చలన చిత్ర రంగంలో కొన్ని వరుస హిట్లు కొట్టిన కృష (జాగర్లమూడి రాధాకృష్ణ) ఇప్పుడు బాలీవుడ్ లోను రంగప్రవేశం చేసారు.

గబ్బర్ ఈజ్ బ్యాక్ అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన హిందీలో దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్ర నిర్మాత సంజయ్ లీలా బన్సాలి. ఈ చిత్రం మే ఒకటో తేదీన విడుదల అయ్యింది.

గుంటూరులో పుట్టి పెరిగిన క్రిష్ మాట్లాడుతూ తనను దర్శకుడిగా చూడాలని కుటుంబ సభ్యులతోపాటు కొందరి సన్నిహిత మిత్రుల కోరికని, తన సినీ కెరీర్ మొదట్లో వీళ్ళు తనకెంతో సహాయం చేసారని, వారి సహాయసహకారాలు తనకెంతో తోడ్పడ్డాయని అన్నారు. తానూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానంటే అదంతా వారి చలవే అని ఆయన అన్నారు.

తానూ కెరీర్ మొదట్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని, ఒకానొక దశలో స్క్రిప్ట్స్ పట్టుకుని ఎందరి దగ్గరకి తిరిగానని, అందరూ వాటిని బాగులేదని తిరస్కరించారని ఆయన చెప్పారు. 2008లో తానూ గమ్యం అనే సినిమాకు దర్శకత్వం వహించానని, ఆ చిత్రానికి పెట్టుబడి పెట్టింది తమ తండ్రిగారేనని క్రిష్ చెప్పారు. ఆ తర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం అనే సినిమాలకు తెలుగులో దర్శకత్వం వహించానని, తమిళంలో వానం అనే సినిమాకు దర్శకుడిగా వ్యవహరించానని ఆయన అన్నారు. గమ్యం సినిమాను చూసినప్పుడు సంజయ్ లీలా బన్సాలీ ఎంతో ఇంప్రెస్ అయి తనతో వర్క్ చెయ్యడానికి ఆసక్తి చూపారని అన్నారు. తాను ఆయనను కలిసినప్పుడు గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమా స్క్రిప్ట్ ఉందని, ఆ కథకు తనను దర్శకత్వం వహించమని ఆయన అడగ్గా అందుకు ఒప్పుకోవడంతో తాను హిందీలో రంగప్రవేశం చేసే అవకాసం లభించిందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో అక్షయ్ కుమారం శృతి హాసన్ తదితరులు నటించారని, సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారని క్రిష్ తెలిపారు. టైం విషయంలో అక్షయ్ కుమార్ తనకెప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, చెప్పిన టైం కన్నా పావు గంట ముందే ఆయన సెట్స్ కి వచ్చేవారని అన్నారు.

తాను అటు బాలీవుడ్ లోను, ఇతి టాలీవుడ్ లోను వర్క్ చేస్తానని చెప్పిన క్రిష్ దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితమే ముంబై వెళ్లి స్థిరపడ్డారు.

ఆల్ ది బెస్ట్ క్రిష్….

Send a Comment

Your email address will not be published.