రెండో సినిమా కథపై చర్చలు

నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమాపై చర్చలు సాగుతున్నాయి. శ్రీనివాస్ నటించిన మొదటి సినిమా అల్లుడు శ్రీను సినిమా అందరికీ తెలిసిందే కదా…

ఆ సినిమా తర్వాత శ్రీనివాస్ రెండో సినిమా రావడానికి ఆలస్యం అవడంతో లేనిపోని చర్చలు జరగడంతో ఆయన స్పందించారు. శ్రీనివాస్ రెండో సినిమా సంగతులు అంతే అని కొందరు పెదవి విరవడం పట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తన తండ్రి తప్పకుండా పుంజుకుని విజయపథంలో నడుస్తారని అన్నారు. దీనిపై అనుమాలు వద్దని శ్రీనివాస్ చెప్పారు.

తన తదుపరి చిత్రానికి సంబంధించి కథాపరంగా చర్చలు ఇంకా సాగుతున్నాయని శ్రీనివాస్ చెప్పారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల రెండో సినిమా ఇప్పట్లో ప్రారంభం కానట్లే నని కొందరు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని అన్నారు.  తన తండ్రికి కొన్ని ఆర్ధికపరమైన సమస్యలు లేవని తాను చెప్పడం లేదు కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు బాగా తెలుసునని అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే చిత్రానికి తన తండ్రి నిర్మాత అని అంటూ మరొక దర్శకుడు భీమనేని శ్రీనివాస్ కూడా తనను సంప్రదించారని అన్నారు. అ చిత్రం తమిళంలో వచ్చిన సుందర పాండ్యన్ అనే సినిమాకు రీమేక్ అని చెప్పారు. ఆ తమిళ సినిమా ప్లాట్ ను తీసుకుని తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ పరంగా కొన్ని మార్పులు చేసినట్టు తెలిపారు. భీమనేని ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, అంతేకాకుండా దానిని నిర్మిస్తున్నారని చెప్పారు శ్రీనివాస్.

ఈ ఏడాది నుంచి తాను ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని చెప్పిన శ్రీనివాస్ వీలు ఉన్నప్పుడల్లా డ్యాన్స్ క్లాసుకి వెళ్తుంటారు. అలాగే జిమ్ కి కూడా వెళ్లి తనను తను కీప్ ఫీట్ గా ఉంచుకుంటారు.

మిగిలిన నటులు నటించిన చిత్రాలను కూడా చూడటం శ్రీనివాస్ హాబీ

తాను ఎవరితోనూ పోటీ పడనని, ఈ చలన చిత్ర పరిశ్రమలో ఒక్కొకరికీ ఒక్కో స్థానం ఉంటుందని, ఎవరి స్థానం వారిదేనని శ్రీనివాస్ అన్నారు. తాను అందరితోను ఫ్రెండ్ గానే ఉంటానని, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అఖిల్ తదితరులతో మాట్లాడటం, వివిధ అంశాలపై చర్చలు జరపడం చేస్తుంటానని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు.

Send a Comment

Your email address will not be published.