రెండో హిందీ చిత్రం

జంజీర్ సినిమాతో బాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన రామ్ చరణ్ ఇప్పుడు తన రెండో హిందీ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. చరణ్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందేమిటంటే చరణ్ రెండో హిందీ చిత్రానికి అశుతోష్ గౌరీకర్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ సినిమా ఒకటి కొనసాగుతోంది. అది పూర్తి అయినతర్వాత అశుతోష్ గౌరీకర్ రామ్ చరణ్ సినిమాకు వర్క్ చేయవచ్చని భోగట్టా.

విజయనగరం రాజు అయిన కృష్ణదేవరాయ చరిత్ర ఆధారంగా సినిమా చెయ్యాలన్నది రామ్ చరణ్ ఆశయం. లగాన్, జోదా అక్బర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన అశుతోష్ గౌరీకర్ అయితే కృష్ణ దేవరాయ చరిత్రను కూడా సరిగ్గా తెరకు ఎక్కించగలరని రామ్ చరణ్ అభిప్రాయం. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వచ్చే ఏడాది తీయాలని చరణ్ ఆలోచన. ప్రస్తుతం బాహుబలి, రుద్రమదేవి వంటి భారీ బడ్జెట్ చిత్రాలు తయారవుతున్నాయి. ఆ రెండు సినిమాలు విడుదల అయిన తర్వాతే ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Send a Comment

Your email address will not be published.