రేజీనా బిజీ బిజీ

ఎవరికి ఎప్పుడు దశ తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఎస్ ఎం ఎస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన చెన్నై పొన్ను రేజీనా ఇప్పుడు తెలుగు సినీ రంగంలో బిజీ బిజీ అట. ఆమె చేతిలో ఇప్పుడు ఆరు చిత్రాలు ఉన్నాయట. అందుకే ఆమె అంత బిజీ నటి అయ్యారు.

తన తొలి చిత్రం ఎస్ ఎం ఎస్ తోనే అందరినీ ఆకట్టుకున్న రేజీనాకు ఆ తర్వాత వచ్చిన “రొటీన్ లవ్ స్టోరీ ” చిత్రం కూడా మంచి పేరే తెచ్చి పెట్టింది. దానితో ఆమెకు అవకాశాలు పెరిగాయి.

ఈ మధ్య వచ్చిన కొత్త జంట చిత్రంలో ఆమెకు నటనాపరంగా మంచి పేరే తెచ్చి పెట్టింది. ఇక నారా రోహిత్ జంటగా నటించిన శంకర, సందీప్ కిషన్ తో నటించిన రా రా కృష్ణయ్య చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం సాయి ధరం తేజ్ తో పిల్లా నువ్వు లేని జీవితంలోను, రవితేజ హీరోగా నటిస్తున్న పవర్ చిత్రంలోను ఆమె కథానాయికగా నటిస్తోంది.

ఇలా ఉండగా అశోక్ దర్శకత్వంలో ఒక చిత్రం మొదలు కానుంది. ఈ చిత్రంలో నాని సరసన రేజీనా నటించబోతోంది.

రేజీనా మీ కెరీర్ ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా కొనసాగాలి.

Send a Comment

Your email address will not be published.