రేసు గుర్రం..

అల్లు అర్జున్ హీరోగా, సృతిహాసన్ హీరోయిన్ గా నటించిన రేసు గుర్రం పాటల సి డీ ని మార్చ్ 16వ తేదీన హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో గల ఒక హోటల్ లో ఆవిష్కరించారు. క్రిక్కిరిసిన అభిమానుల సమక్షంలో ఈ పాటల పండుగ కోలాహలంగా సాగింది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, డా. కె వెంకటేశ్వర రావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమే రేసు గుర్రం .

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ కష్టే ఫలి అనేది ఎప్పుడు విస్మరించకూడదని చెప్పారు. అల్లు అర్జున్ పడిన కష్టమే అతనిని ఈ రోజు ఈ స్థాయికి తీసుకువచ్చిందని అన్నారు. నా నుంచో లేక తమంతట తాము క్రమశిక్షణ, శ్రమించే గుణాన్ని అలవరచుకున్నారని చెప్పారు. బన్నీ అన్ని విధాలా ఎనర్జీ ఉన్న హీరో అని, అందుకే ఈ టైటిల్ అన్ని విధాలా అతనికి సరిపోయిందని అంటూ శక్తీ, వేగం వంటివాటికి ప్రతీకగా గుర్రాన్ని చెప్పుకుంటారని, అవన్నీ బన్నీ లో బాగా ఉన్నాయని తెలిపారు. డాడీ సినిమాలో బన్నీ ఒక చిన్న డాన్సు చేసి అందరినీ ఆకట్టుకుని గంగోత్రిలో అవకాశం పొందాడని అన్నారు. కథలో కొత్తదనం కనబడుతోందని, ఈ మధ్యకాలంలో పైరసీ ఎక్కువైపోయిందని, దానిని అరికట్టేందుకు యువత పూనుకోవాలని పిలుపునిచ్చారు. ఆస్తులు అమ్మి సినిమాలను తీస్తుంటే పైరసీ కారణంగా నష్ట పోవాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేసారు. నిర్మాతలు కూడా ఆర్జించాలి అన్న విషయం యూనిట్ లోని వారందరూ గుర్తించి ఆమేరకు సహకరించాలని అన్నారు. ఇప్పటి ట్రెండ్ లో హీరో, దర్శకులు మాత్రమె ముందు వరసలో ఉంటున్నారని, నిర్మాతలను కూడా ముందు వరసలో ఉంచాలని చిరు అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో అర్జున్, నటులు బ్రహ్మ్మానందం , ఆలీ, దర్శకుడు సురేంద్రరెడ్డి, నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, డా. కె వెంకటేశ్వర రావు, సంగీత దర్శకుడు తమన్, కె ఎల్ నారాయణ, శరత్ మరార్త, వీ వీ వినాయక్ దితరులు పాల్గొన్నారు.

Send a Comment

Your email address will not be published.