లండన్ లో రాజమౌళి హంగామా

rajamouli ssఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న ప్రభుత్వ భావన సముదాయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన అసెంబ్లీ, హై కోర్ట్, సచివాలయం డిజైన్ లపై లండన్ నగరంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కొందరు ప్రముఖులతో సుదీర్గా చర్చలు జరిపారు. మంత్రి నారాయణ బృందంతోపాటు వెళ్లిన రాజమౌళి ఈ డిజైన్ లను రూపొందిస్తున్న నార్మన్ పోస్టర్ సంస్థ అధిపతులతో చర్చలు జరిపారు. రాజమౌళితో పాటు ఈ బృందం రెండు రోజులతో పాటు, నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ భేటీలో రాజమౌళి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ఆ ప్రతినిధులకు కొన్ని డిజైన్స్ చూపించారు. అల్లాగే ఆ సంస్థ రూపొందించిన కొన్ని నమూనాలను పరిశీలించి, కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులు తన ముందుంచిన నమూనాలపై ఆయన సునిశిత విశ్లేషణ జరిపారు. దీంతో, డిజైన్స్ పరిశీలనా నిమిత్తం ఈ నెల 24 , 25 తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ వెళ్లేసరికి అవి ఆయన ఆకాంక్షిస్తున్న విధంగా తయారవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Send a Comment

Your email address will not be published.