లడ్డూ బాబుగా అల్లరి నరేష్

టాలీవుడ్ లో ఎలాంటి పాత్రనైనా పోషించగల నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన  ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ నటించిన లడ్డూ బాబు పాటల పండగ మార్చి 17వ తేదీన ఆహ్లాద వాతావరణంలో సాగింది. ఈ చిత్రానికి చక్రి  స్వరాలూ అందించారు.
రవి బాబు దర్శకత్వం వహించిన  ఈ చిత్రంలో నరేష్ టైటిల్ కు తగ్గట్టే లడ్డూలా కనిపిస్తాడు. ఓ లావోడు అందమైన భార్య కోసం వెతకడమే ఈ చిత్ర కధనం. పూర్ణ నాయకిగా నటిస్తోంది. భూమిక చావ్లా కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
చక్రి మాట్లాడుతూ ఈ చిత్రం మొత్తం హాస్య రసంతో కూడుకున్నదని అన్నారు. కడుపుబ్బా నవ్వించే చిత్రమంటూ ఇంగ్లాండ్ నుంచి ప్రత్యేకించి మైక్ ను రప్పించి నరేష్ లడ్డూలా కనిపించేందుకు మేకప్ చేయించారని అన్నారు.
ఈ చిత్రంలో నరేష్ బరువు 268 కిలోలు.
బొద్దుగా ఉన్న వాళ్ళ సమస్యలను ఈ చిత్రంలో చూపిస్తున్నామని, అలాంటి లడ్డూ బాబు ఎలా విజయం సాధించాడన్నదే ఈ చిత్రం కథాంశమని నరేష్ చెప్పారు. లడ్డూ వేషంలో నరేష్ దాదాపు 68 రోజులు నటించాడట.
ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది.

Send a Comment

Your email address will not be published.