లారెన్స్, కాజల్ క్రొత్త చిత్రం

Lawrenceప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు డిమాండ్ పెరిగింది. భారతీయ చలన చిత్ర రంగంలోనే ఓ గొప్ప రికార్డుతో సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రానికి కథ సమకూర్చింది విజయేంద్ర ప్రసాద్…అందరికీ తెలిసిందే.

ఒకటి తర్వాత ఒకటిగా చిత్రాలతో విజయపధంలో దూసుకుపోతున్న విజయేంద్ర ప్రసాద్ కథల కోసం ఇప్పుడు అన్ని వర్గాల వారు ఎదురుచూస్తున్నారు. ఆయనతో ఇప్పటికే చర్చలు జరుపుతున్న వారున్నారు.

తమిళ నటుడు లారెన్స్ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ రూపొందించే అవకాశాలు మెండుగా ఉనాయి. లారెన్స్ ఆయనతో మాట్లాడినట్టు త్వరలోనే ఆయన ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలిసింది. సన్నిహిత వర్గాలతో తెలిసిన విషయం ఏమిటంటే ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ తయారు చేస్తున్న కథ పూర్తిగా వాణిజ్య పరమైనదని. పైగా ఆ కథలో నవ్యతపాలు ఎక్కువని తెలిసింది.

ఇప్పటి వరకు అనుకున్నట్టే జరిగితే ఆయన కథతో ఓ భారీ చిత్రం తయారయ్యే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో గానీ లేదా వచ్చే నెలలో ఈ చిత్ర వివరాలు తెలుస్తాయి. లారెన్స్ సరసన కాజల్ అగర్వాల్ నటించబోతోంది. ఈ చిత్రం ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ తయారవుతుంది. ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న మహాదేవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు మిత్రుడు తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Send a Comment

Your email address will not be published.