సరికొత్త రికార్డు

బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ చిత్రం తాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. వారాహి చలన చిత్రం సమర్పించిన లెజెండ్ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు బోయపాటి శ్రీను.
కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గల మినీ శివ థియేటర్ లో రోజుకు నాలుగు ఆటల చొప్పున నాలుగు వందల రోజులు పూర్తి చేసుకుంది. 2014 మార్చి 28వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం మే ఒకటో తేదీకి నాలుగు వందల రోజులు పూర్తి చేసుకుని టాలీవుడ్ చరిత్రలో నాలుగు వందల రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డు పుటలకెక్కింది.
ఇదిలా ఉండగా టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటగా వాన్ రోజులు పూర్తి చేసుకున్న తొలి చిత్రం బాలనాగమ్మ. సంవత్సరం 1942.
రెండు వందల రోజులు ఆడిన మొదటి తెలుగు చిత్రం పాతాళభైరవి. సంవత్సరం 1951.
మూడు వందల రోజులు ఆడిన తొలి చిత్రం అడవిరాముడు. సంవత్సరం 1977.
ఇప్పుడు నాలుగు వందల రోజులు ఆడిన తొలి చిత్రం లెజెండ్. సంవత్సరం 2014 – 2015.

Send a Comment

Your email address will not be published.