లేటు వయసులో హాట్ ఎంట్రీ

ఉగ్గుపాల వయసులోనే …. అంటూ మంచు లక్ష్మి ఎత్తుకోగానే మంచు కుటుంబమంతా ఆనందంతో ఉబ్బి తబ్బి పోయి పరవశించి పోయింది. అయితే సగటు ప్రేక్షకుడు మాత్రం మంచు వారి అమ్మాయి లేటు వయసులో హాట్ ఎంట్రీ ఇచ్చింది అని భావిస్తున్నారు.

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు. ఎన్నో వైవిధ్యం ఉన్న పాత్రల్లో పోషించి మెప్పించారు. విలనిజాన్నీ, హీరొఇయి జాన్నీ సమర్ధ వంతం గా పోషించి తనకు సాటి మరొకరు లేరని ప్రశంసలు అందుకున్నాడు. లక్ష్మీ ప్రసన్నపిక్చర్స్ బ్యానర్ పైన ఆయన ఎన్నో మంచి సినిమాలు నిర్మించి అభిరుచి గల నిర్మాత గా కూడా నిరూపించు కున్నారు. ఆయన నట వారసులుగా మొదట కుమారులు విష్ణు, మనోజ్ లు ఇద్దరూ పరిశ్రమ లో అడుగు పెట్టారు. విష్ణు నటించిన ఒక్క డీ సినిమా తప్ప వారిద్దరికీ బంపర్ హిట్ సినిమాలు ఏమీ లేవు. మనోజ్ బిందాస్ పరవాలేదని పించగా, విష్ణు ఇటీవల నటించిన దూసుకెల్తా కూడా బోల్తానే పడింది. తమ్ముళ్ళు ఇద్దరితో పాటు సినిమా రంగం లో ప్రవేశించారు మోహనబాబు ముద్దుల తనయ లక్ష్మి.

హాలీవుడ్ సినిమాల్లో సత్తా చాటిన తర్వాత లక్ష్మి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టారు. మొదట తండ్రి స్థాపించిన నిర్మాణ సంస్థ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాతగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఉత్తరాది తార తాప్సీని పరిచయం చేస్తూ తమ్ముడు మనోజ్ కధానాయకుడిగా, తండ్రి మోహన బాబు ప్రధాన పాత్రలో పెట్టి దర్శకుడు కె.రాఘవేంద్రరావు తో ‘జుమ్మంది నాదం’ సినిమాని నిర్మించింది. సంగీత ప్రధానంగా సాగిన ఆ సినిమా పెద్దగా లాభాలు ఆర్జించలేదు. ఆ తర్వాత మరోసారి తమ్ముడు మనోజ్, ప్రత్యేక పాత్రలో బాలకృష్ణతో ‘ఊకొడతారా .. ఉలిక్కి పడతారా’ సినిమా తీసారు. అదీ పరాజయాన్నే చవి చూసింది. ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే ఈ టీవీలో టాక్ షో విత్ లక్ష్మి వ్యాక్యాతగా అందరి ప్రశంసలు అందుకున్నారు. మంచు వారి అమ్మాయి అందంగా ఉంది అన్న టాక్ టీవీలలో రావడంతో వెండి తెరపై నటించడానికి సిద్ధమయ్యారు లక్ష్మి.
ఇండస్ట్రీ కి తాను పరిచయం చేసిన తాప్సితో పాటు తను కూడా మరో హీరోయిన్ గా నటిస్తూ ‘గుండెల్లో గోదావరి’ సినిమా తీసారు. తెలుగింటి పల్లె పడుచులా నటించినా, సొంతముగా డబ్బింగ్ చెప్పుకున్నా ప్రేక్షకులు కనికరించ లేదు. ఆ తర్వాత మరోసారి పెద్ద తమ్ముడు విష్ణు సినిమాలో ఉగ్గుపాల వయసులోనే అంటూ ప్రత్యేక గీతంలో కనిపించింది. అయితే ఆ పాత్రలో మంచు లక్ష్మిని చూసిన ప్రేక్షకులు మాత్రం ఇంత లేటు వయసులో ఎంత హాట్ ఎంట్రీ ఇస్తే మాత్రం ప్రయోజనం ఏముంది. ఒక పది సంవత్సరాలు ముందు వస్తే బాగుండు కదా అని పెదవి విరుస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.