వందో సినిమా కోసం తహతహ

బాలకృష్ణకు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు (సింహ, లెజెండ్) అందించిన బోయపాటి శ్రీనివాస్ ఆయన వందో చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారని తెలిసింది.

ప్రస్తుతం బాలకృష్ణ 98వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు సత్య దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రంలో త్రిషా బాలకృష్ణ సరసన నటిస్తోంది. ఈ చిత్రం పూర్తి కావడం తోనే బాలకృష్ణ 99వ సినిమా చేసేసి వందో సినిమాను వీలున్నంత త్వరలో పూర్తి చేయాలని ఆరాటపడుతున్నారు. బాలకృష్ణ నటించబోయే 99వ చిత్రానికి బీ గోపాల్ దర్శకత్వం వహిస్తారు అని సన్నిహిత వర్గాల భోగట్టా. ఈ 99వ చిత్రం సంక్రాంతి పండగకి ప్రారంభమై వచ్చే ఏడాది దసరాకు విడుదల అవుతుందని అంచనా. వచ్చే సంవత్సరమే బాలకృష్ణ తన వందో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఆ వందో సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని తెలియవచ్చింది. ఎందుకంటే సింహ చిత్రం నుంచి బోయపాటి శ్రీనుతో బాలకృష్ణకు మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ఇద్దరి మధ్య మంచి అవగాహన కూడా ఉన్నట్టు భోగట్టా.

మరోవైపు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.