వచ్చేసాయ్ చందమామ కథలు

చందమామ కథలు చదవని వారుండరు. తెలియని వారుండరు. విననివారుండరు. ఈ నాటి కుర్రాళ్ళకు తెలియకపోయి ఉండవచ్చు. కానీ పూర్వం బామ్మలు ఒళ్ళో కూర్చోపెట్టుకుని చందమామ కథలు చెప్పడం తెలిసిందే కదా? అయితే కాలం మారుతున్న కొద్దీ కథలు చెప్పే తీరులోనూ మార్పులు తప్పవు. ఆ చెప్పే తీరుకు సామాజిక సమస్యలను జోడించి చెప్పటం అవసరమై ఇప్పుడీ చందమామ కథలు మన ముందుకు వచ్చేసాయి.
చాణక్య బూనేటి నిర్మించిన ఈ చిత్రంలో మొత్తం ఎనిమిది కథలున్నాయి. ఇవి జీవమున్న కథలు. జీవనముంది. నిజ జీవితం ఉంది. ఇందులో మనకు కనిపించే పాత్రలన్నీ మనకు రొజూ కనిపించేవే. వాటిని స్పష్టంగా చూస్తే వాటి నడతను గమనిస్తే మనకు కొత్తగా కనిపిస్తాయి. థ్రిల్లుకు లోటు లేదు. ఈ కథల్లో లవ్, సెంటిమెంట్, యాక్షన్, కామెడి, కమర్షియల్, గ్లామర్, ఇలా అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నిజ జీవిత చరిత్రగా మనకు అనిపిస్తాయి అనడంలో సందేహం లేదు.
మంచు లక్ష్మి, సీనియర్ నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్, నాగ శౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, చైతన్యకృష్ణ, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ స్వరాలూ అందించారు. ఈ చిత్రంలోని పాటలను డిజిటల్ ఫార్మేట్ లో ఇప్పటికే చేరువయ్యాయి. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు.

Send a Comment

Your email address will not be published.