హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కుమారుడు రాజ గౌతం నటించిన బసంతి ప్రేక్షకులముందుకు ఫిబ్రవరి 28న వచ్చింది. సినిమా టైటిల్ విషయంలో దర్శకుడి పనితనం గుర్తించవలసి ఉంది. ప్రేమకు గుర్తుగా గులాబీ పువ్వుని, కింద తుపాకీని పెట్టిన తీరుకు తగ్గట్టుగానే ఈ సినిమా కథ సాగింది. అలాగని ఇది ఒక ప్రయోగాత్మక చిత్రం కాదు. అన్ని విధాల వాణిజ్యపరమైన హంగులున్న చిత్రమిది. సమాజానికి ఉపయోగపడే చిత్రమిది. యువత బాధ్యత గుర్తెరిగి నడచులోవాలని చెప్పిన చిత్రమిది.
అందరికీ నచ్చేవిధంగా చైతన్య దంతలూరి దర్శకత్వంలో రూపొందినట్టు సినీ యూనిట్ చెప్పుకున్న ఈ చిత్రంలో ప్రధానాంశం
బసంతి కాలేజీలో చదువుతున్న గౌతంకు చెప్పుకోదగ్గ ఆశయాలు లేవు. అతను చూసీ చూడటంతోనే కథానాయకి అలీషా బేగ్‌ని ఇష్టపడతాడు. కథానాయకి ఓ కమీషనర్ కూతురు. ఆమె నాయనమ్మకు కథానాయకుడు రక్తదానం చేసిన క్రమంలో కథానాయకికి దగ్గరవుతాడు. వీరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగి కథానాయకుడు ఉగ్రవాదుల నుంచి తన మిత్రులను, ప్రేమికురాలిని ఏ విధంగా రక్షించేడన్నది ఈ చిత్ర కథనం. అయితే కథనం మధ్యలో మామూలుగా సాగిందనే భావం కలుగుతుంది.
బసంతితో తన కొడుకు గౌతం తన పేరు నిలబెదతాడనే నమ్మకముందని బ్రహ్మానందం ఆశాభావం వ్యక్తం చేసారు.
ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు అందించారు.
బాణం తరహాలో ఈ చిత్రంతోనూ తనకు మంచి పేరు వస్తుందన్న నిర్మాత, దర్శకుడు చైతన్య దంతలూరి ఆశ ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి మరి?