భీమవరం బుల్లోడు

ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14వ తేదీన సునీల్ బీమవరం బుల్లొడుగా ప్రేక్షకులముందు రావడానికి రంగం సిద్ధమైంది. ప్రేక్షకులకు కామెడీతోపాటు యాక్షన్ కూడా కలగలసిన ఈ చిత్రంలో సునీల్ కు జంటగా ఎస్తేర్ నటించింది.

భీమవరంలో ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా తిరుగుతుండే రాంబాబు (సునీల్) బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరి కొన్ని రోజుల్లోనే చనిపోతాడని ఇచ్చిన డాక్టర్ల తప్పుడు రిపోర్ట్ వాళ్ళ ఆ కుర్రాడు తానెలాగూ చనిపోతాను కనుక చచ్చిపోయేముందు కొన్ని మంచి పనులైనా చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే అతను రౌడీల ఆట కట్టించడానికి గాను కొందరిని కొడతాడు. ఆ సమయంలోనే అతను ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు. ఇంతలో అతనికి ఎలాంటి అనారోగ్యం లేదని తేలిపోతుంది. దానితో అతనికి జీవితంపై మళ్ళీ ఆసలు చిగురిస్తాయి. టూకీగా ఇది కథనం.

నిజానికి మొదట విక్టరీ వెంకటేష్ ను హీరోగా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. వెంకటేష్ కు బదులు సునీల్ ను కథానాయకుడిగా ఎన్నుకున్నారు. తాము అనుకున్న పాత్రకు సునీల్ అన్ని విధాల తగు న్యాయం చేసాడని దర్శకుడు ఉదయశంకర్ చెప్పారు.

సురేష్ ప్రొడక్షన్స్ బానర్ పై డీ సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ సంగీతం అందించగా శ్రీధర్ మాటలు సమకూర్చారు. ఫోటోగ్రఫి సంతోష్ రాయ్.

Send a Comment

Your email address will not be published.