వయస్సుతో సంబంధం లేదు

జీవితాంతం నటిస్తూనే ఉంటాను అని హిందీ నటి విద్యాబాలన్ చెప్పారు. నటించడానికి కావాల్సింది వయస్సు కాదని, తెరపై కనిపించాలనే ఉత్సాహం, కోరిక ఉంటే చాలని ఆమె చెప్పారు. నటించడానికి అవసరమైన ఈ ఉత్సాహం, కోరిక నా దగ్గర ఉన్నందు వల్ల నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనను దగ్గరకు రానివ్వనని విద్యాబాలన్ అన్నారు.

బాలో తెహికో అనే సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో కొన్ని ఆటుపోట్లు, చేదు అనుభవాలు ఎదురైనా ఆమె వాటిని అధిగమించి ఈ రంగంలో నిల్చో గలిగారు.

ఆమెకు బాలీవుడ్ పరిశ్రమ క్రమంగా ఎర్ర తివాచి పరిచి అవకాశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలకు మంచి పేరే వచ్చింది. అవార్డులూ రివార్డులూ దక్కాయి. ఆమె కెరీర్ కు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ద డర్టీ పిక్చర్.

నటనలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజయపధంలో దూసుకుపోతున్న విద్యాబాలన్ తనకిప్పుడు 36 ఏళ్ళు అయినా ఎనభై మూడేళ్ళు వచ్చే వరకు నటించాలని ఉందని మనసులో మాట చెప్పారు. వైవాహిక జీవితంతోపాటు వృత్తిపరంగా కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న విద్యాబాలన్ డర్టీ పిక్చర్ లాంటి సినిమాలను తాను ఎప్పుడూ ప్రేమిస్తానని అన్నారు.

Send a Comment

Your email address will not be published.