వరుణ్ సందేశ్ ప్రేమ కథ

వరుణ్ సందేశ్, వితిక శేరు జంటగా నటిస్తున్న” పడ్డానండి ప్రేమలో మరి” చిత్రం షూటింగు హైదరాబాద్ లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు ఉప్పుటూరి మహేష్ మాట్లాడుతూ ఇదొక ప్రేమ కథ అని, సకుటుంబ కథా చిత్రమని, ఎమోషన్స్ కు లోటు  ఉండదని అన్నారు. వరుణ్ కు ఈ చిత్ర కథ అన్ని విధాలా సరిపోతుందని చెప్పారు.
వరుణ్ కు జోడీగా నటిస్తున్న వితిక ” ప్రేమ ఇష్క్ కాదల్ ” చిత్ర ఫేం అని, వరుణ్ కెరీర్ లో ఈ చిత్రం గొప్పగా చెప్పుకునేలా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రేమకథా చిత్రాన్ని వీలున్నంత త్వరగా పూర్తి చెయ్యాలన్నది తమ ఉద్దేశమని నిర్మాత ఎన్ రామచంద్ర ప్రసాద్ చెప్పారు.
ఈ చిత్రం టైటిల్ సాంగ్ ని విజయవాడలోను, మరొక పాటను పల్నాడులోను చిత్రీకరించనున్నట్టు నిర్మాత చెప్పారు.
అలాగే మరికొన్ని పాటలను వెనీస్ లో షూట్ చేస్తామని కూడా ఆయన అన్నారు.
ఈ చిత్రంలో తాగుబోతు రమేష్, అరవింద్, ఎమ్మెస్ నారాయణ, తెలంగాణా శకుంతల తదితరులు నటిస్తున్నారు.
ఏ ఆర్ ఖద్దూస్ సంగీత సమకూరుస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.