వర్మకు బెదిరింపులు!!

రాం గోపాల్ వర్మ సమర్పించే వంగవీటి చిత్రం చుట్టూ మళ్ళీ వివాదాలు కమ్ముకున్నాయా? విజయవాడలోని కొన్ని పరిణామాలు వీటిని అవుననే చెప్పకచెప్తున్నాయి.

కొన్ని రోజుల క్రితం చట్టపరమైన వివాదం తలెత్తడంతో తప్పని పరిస్థితిలో వర్మ తన చిత్రంలోని “కమ్మకాపు” పాటను వంగవీటి సినిమా నుంచి తొలగించవలసి వచ్చింది……

ఇప్పుడు ఆ చిత్రం విడుదల విషయంలో సమస్యలు తప్పడం లేదు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న వర్మ డిసెంబర్ మూడో తేదీన వంగవీటి కుటుంబసభ్యులను కలిసారు. వీరి మధ్య మాటలు వాడిగావేడిగా సాగినట్టు తెలిసింది.
వంగవీటి చిత్రం ఆడియో వేడుక నేపధ్యంలో విజయవాడలో ఆర్జీవీ వంగవీటి రాధను, ఆయన తల్లిని కలిసారు. ఆర్జీవీ కొన్ని ట్రైలర్స్ కూడా వారికి చూపించారు. అయితే వాటితో రాదా, ఆయన తల్లి అంత హ్యాపీ గా లేరని తెలిసింది. తమ కులాన్ని తక్కువ చేసేలా ఉందని రాధా, ఆయన తల్లి చెప్పినట్టు, వాటిని మార్చడమో లేదా కొన్ని సన్నివేశాలు తొలగించడమో చేయాలని వారు చెప్పినట్టు తెలిసింది. అందుకు ఆర్జీవీ అంగీకరించ లేదు. దీనితో వారి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు వారు హెచ్చరించినట్టు కూడా సినిమా యూనిట్ వర్గాల వల్ల తెలిసింది.

ఈ చిత్ర నిర్మాత దాసరి కిరణ్, ఎం ఎల్ ఏ కొడాలి నాని కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఆర్జీవీ మాట్లాడుతూ తాను దేనికీ భయపడనని, ముంబై అండర్ వరల్డ్ కూడా తనను బెదిరించిన సందర్భాలు ఉన్నాయని, తొలిసారి నవ్వుతూనే వార్నింగ్ చూడాల్సి వచ్చిందని, కానీ అది చాలా ప్రమాదకరమని అన్నారు. అంతమాత్రాన వంగవీటిపై తన అభిప్రాయంలో మార్పు రాదని చెప్పారు. ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సమస్యలు సృష్టించినా వంగవీటి రాధా రంగా మిత్ర మండలి తనకు మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు.
ఈ సంఘటనను ఆర్జీవీ ట్విటర్ లో కూడా పోస్ట్ చేసారు.

Send a Comment

Your email address will not be published.