వస్తున్నాది ఈ వేళలో ...

మలయాళంలో నిత్య మీనన్, ఉన్ని ముకుందన్, శ్వేతా మీనన్ నటించి అన్ని విధాల విజయం సాధించిన ఓ చిత్రం తెలుగులో “ఈ వేళలో” అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వల్లభనేని అశోక్ కుమార్ తెలుగులో తీసుకొస్తున్న ఈ చిత్రాన్ని జీవితా రాజ శేఖర్ సమర్పిస్తారు.

శ్రీ శరత్ సంగీతం అందించారు.

ఈ చిత్రం పాటల పండగ హైదరాబాద్ లో కనుల పండువగా జరిగింది. పాటల సీడీని సహజ నటి జయసుధ ఆవిష్కరించారు. మొదటి సీడీని సముద్రాల గోవింద రాజులు అందుకున్నారు.

ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, “నిత్యా మీనన్ అందరికీ నచ్చే నటి. ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన కథలకు ఆమె అచ్చంగా సరిపోతుంది. మలయాళం విజయం సాధించినట్టే తెలుగులోనూ ఈ చిత్రం గొప్ప విజయం పొందాలి” అని ఆకాంక్షించారు.

ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ “చక్కని కథ. నిత్య మీనన్ పాత్ర వైవిద్యభరితమైనది. పాటలు బాగా వచ్చాయి. సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది అనే నమ్మకం నాకు ఉంది” అని చెప్పారు.

ఎన్నో ఆశలతో బుల్లితెర రంగంలో అడుగుపెట్టిన ఓ అమాయకురాలు ప్రేమలో పడటం వల్ల వచ్చిన ఇబ్బందు ఏమిటీ, వాటిని ఆమె ఎలా అధిగమించింది అనేదే ఈ చిత్ర కథాంశం అని నిర్మాత తెలిపారు.

ఈ చిత్రం డబ్బింగ్ పనులు తుది దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల అవుతుంది.

Send a Comment

Your email address will not be published.