వాయిదా వేసుకున్న అ, ఆ..

హైదరాబాదులో ఈ మధ్య రెండు కొత్త చిత్రాల ఆడియో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అవి, అ, ఆ…చిత్రం. ఇంకొకటి బ్రహ్మోత్సవం.
వీటిలో బ్రహ్మోత్సవం చిత్రం అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దు కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ, ఆ చిత్రం తెరకెక్కింది.

ఈ రెండు చిత్రాలలో కథానాయిక సమంతా కావడం విశేషం. అయితే బ్రహ్మోత్సవం చిత్రంలో హీరో ప్రిన్స్ మహేష్ బాబు కాగా అ, ఆ చిత్రంలో హీరో నితిన్.

ముందే అనుకున్న ప్రకారం బ్రహ్మోత్సవం చిత్రం మే 20వ తేదీన విడుదల అవుతుండగా అ, ఆ చిత్రం నిర్మాత ఎందుకొచ్చిన చిక్కులు అనే అభిప్రాయంతో తమ చిత్రాన్ని జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇద్దరు దర్శకులు తమ సినిమాల విడుదలలో కాస్త గ్యాప్ ఉండటం మంచిదని అభిప్రాయపడినట్టు తెలిసింది. అంతేకాదు విడుదల విషయంలో త్రివిక్రమ్, మహేష్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సన్నిహిత వర్గాల వల్ల తెలిసింది.

Send a Comment

Your email address will not be published.