విక్టరీ వెంకటేష్ రాధా

ప్రేమ, కుటుంబ విషయాలను మేళవించిన రాధా చిత్ర నిర్మాణం ఈ నెల ఆరవ తేదీన ప్రాంభమైంది. హైదరాబాద్ లోని రామానాయడు స్టూడియో లో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను యూనివర్సల్ మీడియా బానర్ పై డీ వీ వీ దానయ్య నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వీ వీ వినాయక్ క్లాప్ కొట్టారు. ఇక నిర్మాత డీ రామానాయుడు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. గీత ఆర్ట్ అధినేత అల్లు అరవింద్ సినిమా స్క్రిప్ట్ ని దర్శకుడు మారుతికి అందించారు. ఈ సందర్భంగా  అల్లు అరవింద్ మాట్లాడుతూ రాధా సినిమా టైటిల్ చెప్పగానే  తనకు వెంకయ్య నటించిన లక్ష్మీ చిత్రం గుర్తుకు వచ్చినట్టు చెప్పారు. మరోవైపు  దర్శకుడు వీ వీ వినాయక్ మాట్లాడుతూ దానయ్యతో తనకున్న అనుభందాన్ని వివరించారు. పూర్వం ఆయనతో చేసిన సినిమాలు విజయం సాదించినట్టే ఇప్పుడు ఈ రాధా సినిమా కూడా తప్పకుండా విజయం సాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

అనంతరం ఈ సినిమా దర్శకుడు మారుతి మాట్లాడుతూ వెంకటేష్ కు జతగా నయన తార నటనకు అన్ని విధాల ఆస్కారమున్న పాత్రలో నటిస్తుందని చెప్పారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సాగుతుందని అన్నారు. తన కొత్త జంట షూటింగ్ పూర్తయిందని, ఇప్పుడు డీ టి ఎస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.వీలున్నంత త్వరలో పాటలు విడుదల చేస్తామని చెప్పారు.

రాధా చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ చాయాగ్రహణం అందిస్తున్నారు. సంగీత దర్సకత్వం జె బీ సమకూర్చగా కదా, కధనం, మాటలు అన్నీను దర్శకుడు మారుతి చూసుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.