విక్రమ సింహ

సూపర్ స్టార్ రజనీకాంత్, దీపికా పదుకొనే నటించిన కోచ్చడయాన్  (తెలుగులో విక్రమ సింహ) చిత్రం వచ్చే నెల 11న విడుదల కానున్నది. మొత్తం 12 భాషలలో ఈ చిత్రం నిర్మించారు. మన దేశంలో తొమ్మిది భాషలలోను, మూడు విదేశీ భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాలోని పాటలను మార్చి 9వ తేదీన చెన్నైలో విడుదల చేసారు. రజనీకాంత్ పాటలను ఆవిష్కరించి తొలి సీడీని ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు ఇచ్చారు. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించారు. పాటల సంబరాలకు తమిళ గేయ రచయిత వైరముత్తు, తెలుగు గేయ రచయితలు చంద్రబోసు, వనమాలి, అనంత్ శ్రీరాం తదితరులు హాజరయ్యారు. ఏ ఆర్ రహ్మాన్ స్వరాలూ అందించారు.

ఈ చిత్రంలోని ఒక పాట (తమిళంలో) కవి వైరముత్తుకి,  సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ కి, సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఎంతో ఇష్టమట. భారత సైన్యంలో పని చేసే ప్రతీ వీరుడు అది తమకోసం రాసిన పాటగా అనుకునేలా ఉందని వీరి అభిప్రాయం. అటువంటి పాట ఒకటి ఉండాలని అనుకుని ఆమేరకు పుట్టిన ఈ పాటలోని భావం ఇదే …..

ఆకాశ మేఘాలు కురిసేటప్పుడు తమకేం లాభమని ఆశించదు….. మాతృదేశాన్ని కాపాడే మనస్సు ఎప్పుడూ తన కోసం బతకదు….ఓ వీరుడా, కర్మ వీరుడా…భాద్యత విస్మరించని వీరుడా….పరాజయాలకు క్రుంగిపోకు, విజయాలకు పిచ్చెక్కిపోకు….రాళ్ళ దెబ్బ తగులుతాయని చెట్టు కాయకుండా పోదు…మాట తూటాలు గుచ్చుకుంటాయని వీరుడు విజయం చూడకుండా పోడు…సాయంత్రాలకు మైమరచిపోకు…. పర్వతాలను చూసి కలత చెందకు…గాలీ, ఓ గాలీ నువ్వు నిద్రనెరగవు…  కర్మ వీరుడా, నువ్వు సైతం విరామమెరుగవు… అనే భావంతో సాగే ఈ తమిళ పాట కోసం కవి వైరముత్తు, సంగీత దర్శకుడు రహ్మాన్ ఎంతగానో శ్రమించారు. కేవలం పాత్రతోనే ఉండిపోక సమాజాన్ని చేరే పాటే విజయవంతమవుతుందని రహ్మాన్ ఈ సందర్భంగా చెప్పారు.

Send a Comment

Your email address will not be published.