విభిన్న పాత్రల్లో...

Raju_Gari_Gadhi2గత రెండేళ్ళల్లో అక్కినేని నాగార్జున విభిన్న పాత్రలు పోషించారు. ప్రత్యేకించి “మనం” చిత్రం తనకు ఓ పెద్ద మలుపు అని నాగార్జున తెలిపారు.

ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలు చెప్పుకోదగ్గవని అంటూ ఈరెండు చిత్రాల్లో తాను పోషించిన పాత్రలు అన్ని విధాల భిన్నమైనవని ఆయన చెప్పారు. త్వరలోనే తాను ఓం నమో వేంకటేశాయ చిత్రంతో ప్రేక్షకులముందుకు వస్తానని అన్నారు. ఈ చిత్రానికి ఒక వారం ముందు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్న దశలో ఓంకార్ తన వద్దకు ఒక భిన్నమైన కథనంతో వచ్చారని, తాను ఇంకా ఎన్ని చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తానో తెలీదని, తన వయస్సు పెరుగుతోందని అన్నారు.

ఓంకార్ దర్శకత్వంలో రాబోయే చిత్రం గురించి మాట్లాడుతూ థ్రిల్లర్ చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచే తాను ఎక్కువగా త్రిల్ల్లర్ చిత్రాలు చూసే వాడినని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి స్టార్లలో అతి తక్కువ మందే థ్రిల్లర్ చిత్రాలు అటెంప్ట్ చేసారని, బహుసా దర్శకులు అగ్ర స్టార్లతో ఈ దిశలో వర్క్ చేయడానికి ఇష్టపడక పోయి ఉండవచ్చని నాగార్జున అభిప్రాయపడ్డారు.

ఓంకార్ తనకు కథ చెప్పినప్పుడు తన పాత్రకు ఎంతో స్కోప్ ఉన్నట్టు ఫీల్ అయ్యానని అన్నారు. అందుకే ఆ చిత్రం చేయడానికి సమ్మతించినట్టు చెప్పారు.

ఊపిరి చిత్రాన్ని చేయడానికి ఒప్పుకున్నప్పుడు తన భార్య, బిడ్డలతో చెప్తూ తాను ఒక మంచి చిత్రంలో చేయబోతున్నట్టు చెప్పానని అన్నారు.
అలాగే ఇప్పుడు ఓంకార్ చిత్రం చేయడానికి ఒప్పుకున్నప్పుడు కూడా ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పానని నాగార్జున అన్నారు.

Send a Comment

Your email address will not be published.