విలన్ గా శరద్ కేల్కర్

నటుడు, రాజకీయనాయకుడు పవన్ కళ్యాన్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ గబ్బర్ సింగ్ – 2 తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంతో సాగుతోంది….పవన్ కళ్యాన్ ఈ చిత్రం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గమనార్హం. కథలోని పాత్రలకు నటులను ఎంపిక చేయడం అంతా పవన్ కళ్యాన్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ చిత్రంలోని ప్రధాన విలన్ పాత్ర కోసం ఎన్నో ప్రొఫైల్స్ పరిశీలించిన పవన్ కళ్యాన్ చివరికి మరాటీ నటుడు శరద్ కేల్కర్ ని ఎంపిక చేశారు. మరాటీ భాషలో గత ఏడాది అన్ని విధాల విజయం సాధించిన లై భారీ చిత్రంలో శరద్ విలన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇప్పుడు శరద్ కేల్కర్ ని పవన్ కళ్యాన్ టాలీవుడ్ కి తన ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేస్తున్నారు.

మొదట్లో శరద్ కేల్కర్ మీద కొన్ని సందేహాలు వచ్చాయి. అయితే మొదటి షెడ్యూల్ తర్వాత శరద్ తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ కళ్యాన్ ఎంపిక అన్ని విధాలా సరిగ్గా ఉందని యూనిట్ సభ్యులు అంటున్నారు. పవన్ ఎంపిక తప్పు కాదని అన్నారు. ధృడమైన శరీరం కలిగి చక్కటి నటన ప్రదర్శించ గలిగిన వారినే ప్రధాన విలన్ గా ఎంపిక చేయాలనుకున్న పవన్ అంచనాలు ఏమాత్రం వమ్ము పోలేదు. శరద్ కేల్కర్ నటన చక్కగా సాగుతోంది. ఇక గబ్బర్ సింగ్ – 2 సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్, దాని చుట్టూ పక్కల ప్రాంతాలలో సాగుతుంది.

Send a Comment

Your email address will not be published.