వీరాభిమన్యు ఓ మలుపు

శోభన్ బాబు 1960 లో చిత్రపు నారాయణమూర్తి గారి భక్త శబరి చిత్రంలో శ్రీరాముడి పాత్ర ద్వారా సినీ రంగప్రవేశం చేసారు.

ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి….అక్కినేని నాగేశ్వర రావు కూడా శ్రీరాముని పాత్ర ద్వారానే

పరిచయమవటం గమనించదగ్గ అంశం.

శోభన్ బాబుకు అక్కినేని లాగానే లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువే.

భక్త శబరి తర్వాత శోభన్ బాబుకి అవకాశాలు పెద్దగా రాలేదు.

ఎన్నో కష్టాలు పడ్డారు. ఎవరెవరినో కలిసారు. ఆ సమయంలోనే బీ ఏ సుబ్బారావు గారి భీష్మ చిత్రంలో ఓ చిన్నపాటి వెశమైనా ఒప్పుకుని అర్జునుడి పాత్రలో నటించారు శోభన్ బాబు.  అలాగే శ్రీకృష్ణ పాండవీయం సినిమాలో కూడా.

అయితే వీ మధుసూదన్ రావు గారి వీరాభిమన్య చిత్రంలో కథానాయకుడిగా నటించడం ఆయన కెరీర్ లో ఓ పెద్ద మలుపనే చెప్పుకోవచ్చు. అయినా ఆయన హీరోగా గుర్తింపు లభించిన చిత్రం లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. ఇది ఎస్ భావనారాయణ గారి చిత్రం. ఆ తర్వాత ఆయన కెరీర్ వెనక్కు తిరిగి చూసుకోకుండా ముందుకు సాగింది.

ఎవరితో ఎంత వరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడటం ఆయన వోఖరి. తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోవడం ఆయన తీరు. పబ్లిసిటీ వాటికి దూరంగా ఉండేవారు. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతూ టెన్షన్  పడకుండా ఉండటాన్ని అలవరచుకున్నారు. అందుకే ఆయన వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా సాగినట్టు చెప్తుంటారు.

Send a Comment

Your email address will not be published.