వీళ్ళందరూ ఇలా....

సీనియర్ నటి లక్ష్మి ఈ తరం హీరోయిన్లపై తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు… అవేంటో చూద్దాం…

సమంతా….అప్పుడే పూచిన పువ్వుని బొకేలో పెట్టి తీసుకొచ్చేలా తాజాగా ఉంటుంది. అందమూ నటన మిళితమైన నటి.

నయనతార … ఆఫ్ ది స్క్రీన్…నిజమూ అనుభూతీ రెండూ కలిసి కనిపించే అమ్మాయి. ఆమె నిరంతర శ్రమ, సినిమా మీదున్న ఆసక్తి ఆమె సినీ రంగంలో ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి దోహదపడ్డాయి. ఆమె నడవడి బాగుంటుంది.

హన్సిక … ఈమె చాల సింపుల్. హైదరాబాదులో ఒక కార్యక్రమంలో చూసాను. ఒక కుర్చీలో కూర్చున్న హన్సికను చూసి మా ఫ్రెండ్ తో ఈమేనా హన్సిక అని అడుగుతున్నప్పుడు ఆమె వెంటనే లేచి వచ్చి నాతో చేతులు కలిపింది. అంతే కాదు, నేను నటించిన జూలీ అనే సినిమా గురించి చెప్పి నన్ను ప్రశంసించింది. అప్పుడు అనుకున్నా…పరవాలేదే సేనియర్ల గురించి తెలుసుకుందే అని.

కాజల్ …. హీరోలందరూ నచ్చే హీరోయిన్. పదహారణాల ప్రొఫెషనల్. సినీ ప్రవేశం ప్రకాశవంతంగా లేనప్పుడు సైతం ఆమె ఎదురీది నిల్చింది. ఆమెకు సాహసమెక్కువ. టాలీవుడ్ లో ఆమె ఒక లక్కీ హీరోయిన్.

తమన్నా … ఒక ఆవకాయ యాడ్ లో కనిపించినప్పుడు మొదటిసారిగా తమన్నాను కలిసాను. నాకు నచ్చిన చిలిపితనం కూడిన అల్లరి పిల్ల. ఆమెలో చిలిపితనంపాలెక్కువ. ఆమె నటించిన సినిమాలు తప్పకుండా చూస్తాను.

లక్ష్మీ మేనన్ … పొరుగింటి అమ్మాయిలా ఉంటుంది. కానే అందులో ఓ అదనపు అందం ఉంటుంది. చాలా బాగుంటుంది.

Send a Comment

Your email address will not be published.