వెండితెరపై కొత్త హీరోలు

ఈ ఏడాది నాగ శౌర్య, సాయి ధర్మ తేజ్ , వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ (చిత్రం – అల్లుడు శ్రీను) టాలీవుడ్ కి పరిచయమయ్యారు. నాగ శౌర్య మినహా మిగిలిన ముగ్గురూ ప్రముఖుల బిడ్డలే.
మరోవైపు సంపూర్నేష్ బాబు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ఆయన తొలి సినిమా హృదయకాలేయం ట్రైలర్ గురించి మాట్లాని వారు లేరు. ఈ సినిమా విడుదలకు ముందే అంతర్జాలంలో విశేష ఆదరణ పొందింది. దీనిని బట్టి తెలిసింది ఏమిటంటే ఒక సామాన్యుడు సైతం టాలీవుడ్ పై ఎంతోకొంత ప్రభావం చూప వచ్చని.
మిగిలిన నాలుగు కొత్త హీరోల్లో నాగ శౌర్యకు మంచి మార్కులే పడ్డాయి. అతను ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమాతో రంగప్రవేశం చేసినప్పటికీ అతను నటించిన మరో సినిమా చందమామ కథలు ముందు విడుదల అయ్యింది. అతనిప్పుడు నాలుగు చిత్రాల్లో నటించాడు. అన్ని సినిమాలకు మంచి విమర్శలే వచ్చాయి. సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్ విషయానికి వస్తే వీరిద్దరూ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. దానితో వారిపై ఎక్కవ అంచనాలే ఉన్నాయి. సాయి ధర్మతేజ్ మొదటి సినిమా ‘రేయ్’ ఇంకా విడుదల కానప్పటికీ అతను తన రెండో సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తో బాగానే మార్కులు కొట్టాడు. ఇక వరుణ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘ముకుంద’ ఈ మధ్యే విడుదలై పరవాలేదు అనిపించుకుంది.

Send a Comment

Your email address will not be published.