వెండితెర మంచి బంగారం

టాలీవుడ్ పరిశ్రమ కె ఎస్ ప్రకాష్ రావు గారి పేరు తలవకుండా ఉండలేదు. వెండితెరకు ఎందరినో అందించిన దర్శకుల్లో అగ్రస్థానం ఆక్రమించిన కె ఎస్ ప్రకాష్ రావుకు నటన పట్ల, సినెమా సాంకేతికత పట్ల విశేషమైన అవగాహన ఉంది.

ఆయన పూర్తి పేరు కోవెలమూడి సూర్య ప్రకాష్ రావు.

1914లో కృష్ణ జిల్లా కొలవేన్నులో పుట్టిన ప్రకాష్ రావు టాలీవుడ్ లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న ప్రముఖులు.

KS Prakash Raoప్రజా నాట్య మండలి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ప్రకాష్ రావు కేవలం దర్శకులు మాత్రమె కాదు. నటుడిగానూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. గూడవల్లి రామబ్రహ్మం ద్వారా తెలుగు సినీ జగత్తుకి పరిచయమైనా ప్రకాష్ రావు మొట్టమొదటగా అపవాదు అనే చిత్రంలో కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం 1941లో వచ్చింది. ఆ మరుసటి ఏడాది పత్ని అనే చిత్రంలో నటించారు. ఇందులోనూ హీరోగా తన ప్రతిభను ప్రదర్శించారు. ఆ తర్వాత బభ్రువాహన, ద్రోహి, ప్రేమ నగర్ చిత్రాలలో నటించిన ఆయన మొదటిసారిగా 1950లో మొదటి రాత్రి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 1948లో ద్రోహి అనే చిత్రంలో నటించడమే కాకుండా ఆ చిత్రాన్ని నిర్మించింది కూడా ఆయనే. అలాగే మొదటి రాత్రి చిత్రానికి కూడా ఆయనే నిర్మాత.

ఈక్రమంలో సన్నివేశాలను ఏ విధంగా పండించాలో తెలుసుకున్న ఆయన ప్రకాష్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఈ బ్యానర్ మీద మొదటి రాత్రి చిత్రాన్ని సమర్పించారు. ఇందులో కథానాయకుడు కూడా ఆయనే కావడం విశేషం.
ఇలాఉండగా ద్రోహి చిత్రం ద్వారా సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావును, దీక్ష అనే చిత్రం ద్వారా రచయిత ఆచార్య ఆత్రేయను, కన్నతల్లి చిత్రం ద్వారా గాయని పీ సుశీలను వెండితెరకు పరిచేసిన ఘనత ప్రకాష్ రావుకె దక్కుతుంది.

కన్నతల్లి చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావుతో బరువైన పాత్రలో నటింప జేసినా ఆయన 1954 లో బాలానందం చిత్రాన్ని ఎంతో గొప్పగా నిర్మించారు. రాజ యోగం అనే చిత్రంలో అప్పటి ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య కుమారుడు సత్యనారాయనబాబుతో ద్విపాత్రాభినయం చేయించారు ప్రకాష్ రావు.

తన కెరీర్ లో ఎనిమిది చిత్రాలు నిర్మించిన ఆయన పదిహేడు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1982 లో కొత్తనీరు అనే చిత్రానికి చివరిసారిగా దర్శకత్వం వహించిన ఆయన 1996 లో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు కె రాఘవేంద్ర రావు కూడా దర్శకుడిగా టాలీవుడ్ లో ప్రముఖ స్థానం నిలబెట్టుకున్నారు. కమర్షియల్ చిత్రాలు అందించడంలో ఆయన దిట్ట. ప్రకాష్ రావు మరో కుమారుడు కూడా చిత్రపరిశ్రమకు చెందినా వారే. ఆయన పేరు కె ఎస్ ప్రకాష్. ఈయన చాయాగ్రాహకుడు.

Send a Comment

Your email address will not be published.