వైజాగ్ లో సందడి చేయనున్న బాలయ్య

సింహా కాంబినేషన్ బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలిసి మరో సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ఆచంట, గోపినాద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నలభై ఐదు రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ జరుపుకోనుంది.

అత్యధిక మాస్ ఇమేజ్ కల్గిన హీరో నందమూరి బాలకృష్ణ వైజాగ్ మహా నగరం లో వేలాది మంది అభిమానుల సమక్షం లో అవుట్ డోర్ షూటింగ్ జరుపు కోవడం అంటే సాహసమే. పది రోజుల పాటు విశాఖ ప్రధాన వీధుల్లో పోరాట దృశ్యాలు చిత్రీకరించి, తర్వాత నానక్ రామ్ గూడా లోని రామానాయుడు స్టుడియోలో వేసిన కోటి రూపాయల భారీ సెట్టింగ్ లో జరుపు కోనునట్టు సమాచారం.

ఈ సినిమా లో బాలకృష్ణ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారు. అందులో ఒక పాత్ర కోసం ఆయన 8 కే.జీ ల బరువు తగ్గారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా విగ్గుని కూడా తయారు చేశారు. ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ సినిమా వైజాగ్ లో షూటింగ్ జరుపు కోనుందని తెలియగానే అభిమానులు తమ హీరో ని చూద్దాం కోసం వైజాగ్ బయలు దేరుతున్నారు.

Send a Comment

Your email address will not be published.