వైశాఖం

Vaishakamబీ ఏ రాజు నిర్మాణంలో ప్రర్ జయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం వైశాఖం.

ఈ చిత్రానికి సంగీతం డీ జే వసంత్.

హరీష్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రంలో సాయి కుమార్, కాశి విశ్వనాధ్, పృధ్వీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇదొక సరికొత్త ప్రేమకథ అనే ముద్రతో వెండితెరకెక్కిన ఈ చిత్ర కథలోకి వెళ్తే….

వేణు పాత్రలో నటించిన హరీష్ హైదరాబాదులో ఒక అపార్టుమెంటులో నివాసం ఉంటాడు. కథాపరంగా వేణు తన అపార్టుమెంటులో ఉన్న వారిని ఏదో విధంగా వాడుకుంటూ ఉంటాడు. అయితే కొన్ని రోజులకు ఈ అపార్టుమెంటులో భాను పాత్రలో నటించిన అవంతిక అద్దెకు దిగుతుంది. తానూ వేణు ప్రేమికురాలినని చెప్పుకుంటూ ఓ బ్యూటీ పార్లర్ నడుపుతుంటుంది. కొంతకాలానికి వీరి మధ్య సమస్య మొదలవుతుంది. గొడవ పడటం ఎందుకుని ఇద్దరూ ఒక ఒప్పందం చేసు కుంటారు.

ఇలా ఉండగా, తొలుత మిత్రులుగా ఉన్న భాను, వేణు ఎలా ప్రేమికులుగా మారారు? వీరి మధ్య గిదవ ఎందుకు వచ్చింది? వంటి వివరాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.

హరీష్, అవంతిక జంట చూడటానికి ఎంతో బాగుంది. అయితే వీరిద్దరిలో హరీష్ నటన చెప్పుకోదగ్గ రీతిలో ఉంది. అలాగని అవంతిక నటనను తీసిపారేయలేము. సాయికుమార్, పృధ్వీ, కాశివిశ్వనాథ్ తదితరులు కూడా తమ తమ పాత్రలకు తగురీతిలో న్యాయం చేసారు.

డిజే వంసత్ సంగీతం వినసొంపుగా ఉంది.

పాటలు బాగానే వచ్చాయి.

ద్వితీయార్థం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ నిర్మాణాత్మక విలువలు చెడకుండా తీసిన చిత్రమే వైశాఖం. కామెడీ సన్నివేశాలతోపాటు కొన్ని ఎమోషన్ దృశ్యాలు కూడా లేకపోలేదు. ఒకసారి చూడదగ్గ చిత్రమే వైశాఖం.

Send a Comment

Your email address will not be published.