శనిదేవుడు

సుమన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న శనిదేవుడు  చిత్రం  తాలూకు షూటింగ్ ఇటీవల ముగిసింది.  సోనీ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న శనిదేవుడు  చిత్రాన్ని జీ బసప్ప మేరు సమర్పిస్తున్నారు.

నవగ్రహాలలో ఒకరైన శనిదేవుడు పేరు చెప్పగానే అదేదో భూతంలా అందరూ భయపడి పోతారని  సుమన్ చెప్పారు. మన జీవితంలో మూడు స్థాయిల్లో శని ఎప్పుడో అప్పుడు వెంటాడుతాడని, యవ్వనంలో శని పడితే తర్వాతి జీవితం ఆనందంగా సాగుతుందని, అదే వయస్సు మళ్ళిన తర్వాత  అయితే అనేక పరిణామాలు ఎదురవుతాయని, ఈ అనుభవం తనకు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు ఎదురైనట్టు భావిస్తానని సుమన్ అన్నారు. అయితే ఆ శనిదేవుడు కరుణ వల్ల తిరిగి తనకు ఆవకాశం వచ్చినట్లు భావిస్తానని కూడా చెప్పిన సుమన్ తోపాటు చంద్రమోహన్, కోట శంకర రావు, కాదంబరి కిరణ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

జొన్నలగడ్డ శివ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య దేవుడి పుత్రుడైన శని దేవుడిని నిందించడం సరి కాదంటూ శని దశ ప్రభావాన్ని ఈ చిత్రంలో చక్కగా చిత్రీ కరించారు. శని వల్లే రాజ యోగం కూడా పడుతుందన్న విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామని దర్శకులు తెలిపారు.

ఈ భక్తి రస చిత్రానికి నండూరి అనిల్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.