శరవేగంగా బెంగాల్ టైగర్

హీరో రవి తేజ బిజీ బజీ అయ్యారు. తాను కథానాయకుడిగా నటిస్తున్న కిక్ 2 సినిమా పాటల కోసం విదేశాల్లో షూటింగ్ ముగించుకుని స్వదేశం వచ్చిన రవితేజ ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా బెంగాల్ టైగర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ బెంగాల్ టైగర్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో కొనసాగుతోంది. చిత్రీకరణలో రావితేజతోపాటు కథానాయికలు తమన్నా, రాశి ఖన్నా తదితరులు పాల్గొంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్ లో రంగప్రవేశం చేసిన బొమన్ ఇరాని ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా వినాయక చవితి సందర్భంలో అంటే వచ్చే సెప్టంబర్ నెలలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Send a Comment

Your email address will not be published.