ప్రిన్సు మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్ మహేష్ బాబు సరసన నటించింది. నిజానికి ఈ చిత్రం జూలై పదో తేదీన బాహుబలి విడుదల అయిన తర్వాత వారం రోజులకు అంటే జూలై 17న విడుదల కావాలి. కానీ ఈ సినిమా ఇప్పుడు ఆగస్ట్ 7వ తేదీన విడుదల అవుతుందని చిత్ర యూనిట్ వర్గాల మాట.
బాహుబలి విడుదల అయిన సమయంలో ఈ సినిమా కూడా విడుదల అవుతే అది అనుకున్నంత విజయం సాధించకపోవచ్చన్న కారణంగానే ఆగస్టుకి వాయిదా పడిందా అనే అనుమాలు కలుగుతుండగా అలాంటి దేమీ లేదని మహేష్ బాబు అన్నారు.
బాహుబలి సినిమా విజయం చలనచిత్ర పరిశ్రమకు అత్యంత అవసరమని, అ సినిమాను చూసి తాను గర్వంగా ఫీల్ అవుతున్నానని, అంతే తప్ప ఆ సినిమా అంటే తనకేమీ భయం లేదని మహేష్ బాబు చెప్పారు.
రెండు భారీ సినిమాల మధ్య కనీసం రెండు మూడు వారాలు గ్యాప్ ఉండటం అవసరమని, ప్రతీ సినీ ప్రేమికుడు టాలీవుడ్ లో బాహుబలి సినిమాను నిర్మించినందుకు చూసి గర్వపడాలని మహేష్ బాబు అభిప్రాయపడ్డారు.