షార్ట్ ఫిల్మ్స్ పోటీలు

చలన చిత్ర పరిశ్రమలో నూతన ప్రతిభను వెతికి  వెలికి తీసేందుకు నటుడు, నిర్మాత అయిన మంచు విష్ణు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ప్రకటన చేస్తూ షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.ఈ పోటీలను ఆయన ప్రతీ ఏడాది నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ పోటీలలో గెలిచిన  దర్శకుడికి  భవిష్యత్తులో తాను నిర్మించబోయే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు.

మన టాలీవుడ్ పరిశ్రమలో ప్రతిభావంతులు ఎందరో ఉన్నారని, వారిని గుర్తించి వెలికితీయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. చిత్రాలను కొత్త మార్గంలో నడిపించే సత్తా ఉన్న వారు లేకపోలేదని, కానీ వారి ప్రతిభను వెలికి తీయాలంటే ఇటువంటి పోటీలు దోహదపదతాయన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు.  అందుకు తోడ్పడే విధంగా తాను ఈ పోటీలు నిర్వహించాలనుకున్నానని చెప్పారు. వెలుగులోకి రాకుండా ఉన్న వారి కలలను వెలికితీయడం ముఖ్యమని విష్ణు తెలిపారు. తాను పెట్టబోయే పోటీలలో గెలిచిన వారి పేర్లను తన  తండ్రి మోహన్ బాబు పుట్టిన రోజైన మార్చి  19వ తేదీన ప్రకటించనున్నట్టు ఆయన చెప్పారు.

Send a Comment

Your email address will not be published.