సంక్రాంతికి ముందే 'గోపాల'

కిషోర్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన గోపాల గోపాల పవన్ కళ్యాన్ అభిమానులకు ఓ పండగే…

డి.సురేష్ బాబు, శరత్ మారర్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రంలో  వెంకటేష్, పవన్ కళ్యాణ్, శ్రియ శరన్ ప్రధాన నటీనటులు.

గోపాలుడి పాత్రలో పవన్ కళ్యాణ్, నాస్తికుడిగా  వెంకటేష్ నటించిన చిత్రం ఇది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది.

మధ్యతరగతికి కుటుంబానికి చెందిన వెంకటేష్  గోపాల్ రావు నాస్తికుడుగా చక్కగా నటించాడు. అయితే ఆయన దేవుడి బొమ్మలు అమ్ముతుంటాడు. ఈ క్రమంలో ఆయన దేవుడి పేరును, మూడనమ్మకాలను బాగానే క్యాస్ చేసుకుంటాడు. ఇంతలో అనుకోని స్థితిలో భూకంపం వచ్చి ఆయన దుకాణం ధ్వంసం అవుతుంది. దానితో చేసేదేమీ లేక ఆయన దుకాణం మీద చేసిన బీమా కోసం కోరుకుంటాడు. కానీ ఆ నష్టం గాడ్ అఫ్ యాక్ట్ అనే దాని వల్ల జరిగినట్టు చెప్పి బీమా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఆయన తనకు అపార నష్టం కలిగించిన దేవుడిపై దావా వేస్తాడు.  అప్పుడు స్వామీజీలుగా ప్రచారం పొందిన మిథున్ చక్రవర్తి, దీక్ష పంత్, పోసాని కృష్ణ మురళి కథలోకి వస్తారు. గోపాల్ రావు పాత్రలో నటించిన వెంకటేష్ ని  చంపడానికి ఈ స్వామీజీలు ప్రయత్నిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ దేవుడి  పాత్రలో  రంగప్రవేశం చేస్తారు. పవన్ కళ్యాన్ వెంకటేష్ కి ఏ విధంగా సహాయం చేసారు? ఎందుకు సహాయం చేసారు? దేవునిపై  వేసిన దావాలో వెంకటేష్ గెలిచేరా? గోపాల్ రావు గెలిచాడా.? తదితర విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి నటించిన సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయనడంలో సందేహం లేదు. అంతేకాదు వారిని ఆలోచింప చేస్తాయి కూడా.

పవన్ కళ్యాణ్ పాత్రను నడిపించిన తీరు ప్రేక్షకులకు వినోదాత్మకమైనదే. ఆధునిక కృష్ణుడి పాత్రలో పవన్ ను చూపించిన తీరు ఎంతో బాగుంది. మరోవైపు వెంకటేష్ నటన కూడా చక్కగా ఉంది. పవన్ కళ్యాన్ కనా వెంకటేష్ పాత్రే ఈ సినిమాలో ఎక్కువ సేపు ఉంటుంది.  శ్రియ శరన్ ది చిన్న పాత్ర.

ఈ సినిమా నిర్మాణ విలువలకు పూర్తి న్యాయం చేకూర్చారు నిర్మాతలు. అందుకే ఈ సినిమాను సకుటుంబంగా చూడవచ్చని పలువురి అభిప్రాయం.

Send a Comment

Your email address will not be published.