సచిన్ గా అమీర్ ఖాన్

సుమారు రెండున్నర దశాబ్దాలుగా భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల జీవితం లో భాగం అయ్యాడు సచిన్. ప్రపంచం యావత్తూ సచిన్ ని క్రికెట్ దేవుడుగా కొలిచింది. మరి ఆట నుంచి క్రికెట్ దేవుడు రిటైర్ అయ్యాడు. ముంబై లోని వాంఖడే స్టేడియంలో తన ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో 74 పరుగులు చేసి తన ఇన్నింగ్స్ ని ఘనంగా ముగించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ మరి ఇంకెప్పుడూ బాట్ పట్టుకొని మైదానం లో కనిపించరు. ఈ ఊహనే క్రికెట్ అభిమానులు తట్టు కోలేక పోతున్నారు. ఇది సగటు ప్రేక్షకులకే కాదు, సెలబ్రేటీ లని కూడా వేధిస్తోంది. ఈ బాధని తీర్చడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముందుకు వచ్చాడు. సచిన్ జీవిత చరిత్రని సినిమా తీయడంతో పాటు సచిన్ పాత్రని కూడా తానే వేస్తానని ప్రకటించాడు.

లగాన్ వంటి క్రికెట్ నేపధ్యం ఉన్న విజయ వంతమైన ఈ సినిమాలతో పాటు త్రీ ఇడియట్స్, తారే జమీన్ పర్ వంటి ఎన్నో మంచి సినిమాలు తీసిన హీరో సచిన్ పాత్రని పోషిస్తానని ప్రకటించడంతో సచిన్ అభిమానులు, అమీర్ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.