సమంతాకు చెప్పలేదట ...

ఆటోనగర్ సూర్య చిత్రంలో కథానాయికగా నటించిన సమంతాకు చేదు అనుభవం ఎదురైంది. ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావలసింది. అయితే ఈ నెల 27వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతాకు మాత్రం ఆ తేదీ చెప్పలేదట. కారణం తెలీదు. ఆమె ఈ చిత్రం విడుదల గురించి ట్వీట్ చేస్తూ ఎవరికైనా విడుదల తేదీ తెలిస్తే చెప్పండని పేర్కొంది.

చిత్ర సమర్పకులు కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. అయితే ఆమెకు మాత్రం ఆ విషయం చెప్పలేదు. నిజానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కొన్ని రోజుల క్రితమే రావలసింది. అయితే ఆర్ధిక సమస్యల వల్ల అది జరగలేదు.

ఇలా ఉండగా ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఆ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చినట్టు కొన్ని వర్గాల భోగట్టా. అంతే కాకుండా రెండు ఏరియాలలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజ్ తీసుకున్నట్టు కూడా తెలిసింది.

చిత్ర నిర్మాతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సెన్సార్ కూడా కానిచ్చుకుని ఈ నెల 27వ తేదీన విడుదల చెయ్యడానికి సిద్ధమైనట్టు చెప్పారు. ఈ చిత్రంలో నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కట్టా దేవా దర్శకత్వం వహించారు.

Send a Comment

Your email address will not be published.