సమంతా ఆశలు పెట్టుకున్న "24"

సూర్య, సమంత, నిత్యా మీనన్, అజయ్, శరణ్య, గిరీష్ కర్నాడ్ తదితరులు నటింక్ హిన చిత్రం “24”
విక్రమ్ కుమార్ రచించి దర్శకత్వం వహించిత్రం “24”. సూర్య నిర్మించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. బ్యాక్ గ్రౌండ్ సంగీతంలో రెహ్మాన్ కి కుతుబ్ సహకరించారు.

ఈ చిత్రంపై సమంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా.

24-movieసూర్యా ఓ శాస్త్రవేత్త. ఇంటినే ఓ ప్రయోగాలకు నిలయంగా మార్చేస్తారు. తన ప్రయోగాలలో భాగంగా కాలంలో ప్రయాణం చేసే ఓ గడియారాన్ని తయారుచేస్తారు. ఈ విషయం అతని కావాలా సోదరుడిగా పుట్టిన ఆత్రేయకు తెలుస్తుంది. అతని క్యారక్టర్ పేరు ఆత్రేయ. అతను శాస్త్రవేత్త సూర్య పై దాడికి దిగుతాడు. ఆ గడియారం కోసం శివకుమార్ తో పాటు అతని భార్య ను సైతం హతమారుస్తాడు. శివకుమార్ భార్యగా నిత్యామీనన్ నటించింది. శివకుమార్ చనిపోయే సమయంలో తన కొడుకుని (మణి) , గడియారాన్ని ఒక అమ్మాయికి ఇస్తాడు జాగర్తగా చూసుకోమని…. ఆ కుర్రాడు తనను కంటికి రెప్పలా చూసుకున్న అమ్మాయినే తల్లిగా భావిస్తాడు. ఇంతలో గడియారంతో కాలంలోకి ప్రయాణించవచ్చని తెలుస్తుంది. మరోవైపు ఆ యువకుడు తన ప్రయోగాలు కొనసాగిస్తూ ఉంటాడు.

ఇదిలా ఉండగా ఆ యువకుడి తండ్రిని హత్య చేసిన ఆత్రేయ ఒక ప్రమాదంలో కోమాలోకి వెళ్తాడు. కొన్నేళ్ళ తర్వాత అతను ఈ లోకంలోకి వస్తాడు. ఆత్రేయకు యువకుడి దగ్గరున్న గడియారం తెలుస్తుంది. గడియారం కోసం ఆత్రేయ యువకుడితో గొడవపడతాడు. వీరి మధ్య ఘర్షణలో ఎవరు గెలిచారు అన్నది తెరపై చూడాలి.
దర్శకుడు విక్రమ్ తన కథతో ప్రేక్షకుల్ని నమ్మించేలా చేయడం ఓ గొప్ప విషయం. ఉద్వేగాలకు కొదవలేని చిత్రం 24.

ఈ చిత్రంలో ఒక పాత్ర భయపెడితే మరొక పాత్ర నవ్విస్తుంది. ఇంకొక పాత్ర ఏడిపిస్తుంది. ఇలా రకరకాల పాత్రలతో విక్రం ప్రేకషకుల మెప్పు పొందాడు అనడంలో ఆలోచించక్కరలేదు.

ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు కూడా బాగానే పండాయి.

క్లైమాక్స్ లో విక్రమ్ ముద్ర చక్కగా తెలుసిన ఈ చిత్రం ఓ వైవిధ్యభరితమైన రీతిలో సాగింది.

సూర్య నటన చిత్రానికి ఓ హైలైట్. అటు అమాయకత్వం, ఇటు క్రూరత్వం రెండింటిలోను సూర్య ఎంతగా విజయవంతమయ్యాడో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.

సమంత ఎంతో ముద్దుగా కనిపించింది. దానికి తగ్గట్టే ఆమె నటన కూడా అమోఘం. మిగిలిన వాళ్ళు కూడా తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేసారు.

రెహమాన్ సంగీతం తిరుగులేనిది. పాటలు బాగున్నాయి.

ఏదేమైనా “24” చిత్రాన్ని చూసిన వాళ్ళు చక్కని చిత్రాన్ని చూసామన్న ఆనందంతో హాల్ నుంచి బయటకు వస్తారు.

Send a Comment

Your email address will not be published.